నాగచైతన్యను శోభిత కోరిందేంటో తెలుసా? నెరవేరితే త్వరలోనే గుడ్‌న్యూస్

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్' ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చైతూ భార్య స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. తన భర్త సినిమా విడుదల సందర్భంగా తన మనస్సులోని మాటలను చెప్పుకొచ్చింది. భర్త కష్టాన్ని తెలియజేసింది. తానూ సినిమాను 'తండేల్' సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని సంతోషం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగానే శోభితా ధూళిపాళ మొదటిసారి అభిమానులకు తెలిసేలా చిన్న కోరికను వ్యక్తం చేసింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా తన భర్తను ఎలా చూడాలనుకుంటుందో తెలియజేసింది. ఫస్ట్ టైమ్ శోభితా తన భర్త కోసం పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 'తండేల్' మూవీ రిలీజ్ సందర్భంగా కాస్ట్ అండ్ క్రూకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చైతూను ఇలా కోరింది.

Do you know what Naga Chaitanya s wife Sobhita wanted for the first time

శోభితా ధూళిపాళ స్పందిస్తూ... 'తండేల్' రిలీజ్ కాబోతుండటం చాలా ఉత్సాహంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో నువ్వు ఎంతో పాజిటివ్ గా, ఏకాగ్రతగా ఉండటం నేను చూశాను. అసాధారణమైన లవ్ స్టోరీని థియేటర్లలో పాటు నేను కూడా వేచి చూస్తున్నాను. అలాగే.. ఎట్టకేళలకు గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ.. అంటూ తన భర్తను ట్యాగ్ చేసింది. తండేల్ రిలీజ్ తర్వాత మొదటిసారిగా తన భర్తను నీట్ షేవ్ తో చూడాలని కోరింది.

అయితే, తండేల్ చిత్రం 2023 డిసెంబర్ లో చిత్రీకరణను ప్రారంభించింది. అప్పటి నుంచి చైతూ పూర్తిగా గడ్డంతోనే ఏడాదిన్నర పాటు ఉన్నారు. ఈ గ్యాప్ లోనే శోభితాతో నాగచైతన్య పెళ్లి కూడా జరిగిన విషయం తెలిసిందే. 2024 ఆగస్టులో వీరి వివాహం సింపుల్ గా కొద్దిపాటి అతిథుల మధ్య జరిగింది. సమంతతో విడాకుల తర్వాత చైతూ శోభితాను పెళ్లి చేసుకొని రెండో జీవితాన్ని ప్రారంభించారు. శోభితా కూడా చైతూపై అమితమైన ప్రేమను కురిపించడంతో అభిమానులంతా సంతోషిస్తున్నారు.

Do you know what Naga Chaitanya s wife Sobhita wanted for the first time

ఇక ఇవ్వాళ రిలీజైన తండేల్ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించారు. శ్రీకాకుళం ఫిషర్ మెన్ పాత్రలో నాగచైతన్య నటించారు. ఫీమేల్ లీడ్ ను సాయిపల్లవి పోషించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ప్రకాశ్ బేల్వాడి, దివ్వ పిల్లై, రావు రమేశ్, బబ్లూ ఫ్రుథ్వీరాజ్, మహేశ్ అచంట కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X