Bigg Boss Telugu 7: హీరోయిన్‌గా రతికా రోజ్ చేసిన రెండు సినిమాలు... ఎక్కడ చూడాలో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ 14 మంది ఎంటర్ అవ్వగా... అందులో ఒక కంటెస్టెంట్ గా రతికా రోజ్.. నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. అయితే రతికా రోజ్ బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టక ముందు రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అసలు ఆ సినిమాలు ఏంటి... ఆ సినిమాల్లో ఎవరు హీరో.. అవి బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ఫలితం అందుకున్నాయి.. ఆ సినిమాలు ఎక్కడ చూడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతుబిడ్డతో లవ్ ట్రాక్: రతికా రోజ్.. బిగ్ బాస్ సీజన్ 7లో బాగా వినిపించిన పేరు. ఈమె ఉన్నది నాలుగు వారాలే అయినప్పటికీ.. రతికా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. రావడం రావడమే... రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు కనెక్ట్ అయి.. అక్కడ అతనితో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత వీరి మధ్య గొడవలు తలెత్తడంతో శత్రువులుగా మారిపోయారు. ఇక మళ్లీ సారి చెప్పుకుని మాట్లాడుకున్న... మళ్లీ వీరి మధ్యగొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక మధ్యలో యావర్ తో ప్రేమాయణం నడపాలనకున్న అది కూడా సక్సెస్ కాలేకపోయింది.

Rathika Rose Pallavi Prashanth Bigg boss

ఎలిమినేట్ అయిన రతికా: ఇక నాలుగో వారంలో రతిక చేసిన ఓవరాక్షన్ కు ప్రేక్షకులు సైతం సహనం కోల్పోయారు. ఆమెపై చాలా నెగిటివిటీ చూపించారు. పవర్ అస్త్ర కోసం ప్రశాంత్ పోటీల్లో ఉండగా... అతను గెలవకుండా ఉండేందుకు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసింది. అంతే కాదు ప్రశాంత్ ఇంట్లో వాళ్లను తిడుతూ... రెచ్చిపోయింది. ఇక ఆమెపై నెగిటివిటీ చూసి బిగ్ బాస్ కూడా ఆమెను ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చాడు.

Rathika Rose Still

మధ్యలోనే ఆగిపోయిన సినిమా: ఇక ఆ విషయం పక్కన పెడితే.. రతికారోజ్ బిగ్ బాస్ హౌజ్ కు రాకముందు సినిమాల్లో రావడానికి చాలా ప్రయత్నాలు చేసింది. పుట్టింది తెలంగాణ జనగాం జిల్లాలో అయినా... చైన్నైకి వెళ్లి హీరోయిన్ అయ్యేందుకు తెగ ప్రయత్నం చేసింది. అక్కడ మారో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా 50శాతం పూర్తికాగానే మధ్యలోనే ఆగిపోయింది. ఇక మళ్లీ హైదరాబాద్ వచ్చేసిన ఈ బ్యూటీ అవకాశాల కోసం తిరిగింది.

Rathika Rose Thupaki Ramudu

తుపాకిరాముడులో హీరోయిన్: ఇక ఈటీవీ పటాస్ షోలో తన ఒరిజినల్ పేరు ప్రియాతో స్టాండప్ కామెడియన్ షోలు చేసింది. ఇక ఆ తర్వాత ఆమెకు సినిమాల్లో చిన్న చితక రోల్స్ చేస్తున్న సమయంలో సినిమా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు అనే సినిమా తెరకెక్కింది. అందులో రతికారోజ్ హీరోయిన్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అయినప్పటికీ.. ఆమెకు గుర్తింపు రాలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది.

Rathika Rose Bomma Adirindhi Movie

షకలక శంకర్ సినిమాలో: ఇక షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది సినిమాలో కూడా రతికా రోజ్ హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఆమె మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక బెల్లంకొండ గణేష్ హీరోగా చేసిన నేను స్టూడెంట్ సార్ చిత్రంలో ఈ భామ నటించింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఈ సినిమాలో కనిపిస్తుంది.

Do you know where to watch the 2 movies with Bigg Boss Telugu 7 Beauty Rathika Rose as the heroine?

ఓటీటీలో ఆ రెండు సినిమాలు: మొత్తానికి రతికా రోజ్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, తుపాకీ రాముడు ఈ రెండు సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక రతికా ఫ్యాన్ అయితే.. ఇప్పుడే ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X