RC16 సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత కాదండోయ్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఆ బాలీవుడ్ బ్యూటీయే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమాతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్ అందుకున్న ఈయన అందుకు తగ్గట్లుగానే ఆ తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలను అందిపుచ్చుకునే విధంగా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న ఈయన.. ఇది విడుదల కూడా కాకముందే నెక్స్ట్ సినిమాను లాక్ చేశారు. అయితే తాజాగా ఆ సినిమా హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారు. ఆ ఛాన్స్ దక్కించుకున్నది ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు. ఇది రామ్ చరణ్ కు 16వ సినిమా కావడంతో RC 16 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చేయబోయే RC16ను లెజెండరీ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. శ్రీకాకుళంలో పుట్టిన ఈయన ఆ తర్వాత విజయనగరంలో పెరిగారు. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఈయన గొప్ప రెజ్లర్ గా పేరు పొందాడు.

ఒంటి చేత్తో రైల్ ఇంజిన్‌ను ఆపారని, ఏనుగును మోసుకెళ్లగల బలశాలి అనే పేరు ఉంది. కోడి రామ్మూర్తి నాయుడు మద్రాసులోని వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని తిరిగి విజయనగరానికి వచ్చి అక్కడ వ్యాయామ శిక్షకుడిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికీ ప్రో ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్ డ్రామాలో హీరోయిన్ గా సమంతను తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒక్క సమంతే కాదు చాలా మంది హీరోయిన్లతో ఫొటో షూట్ చేశారని కూడా టాక్ నడిచింది.
ముఖ్యంగా రామ్ చరణ్, సమంతల మధ్యే కాక మరికొంత మంది స్టార్ హీరోయిన్లతో కూడా ఫొటోషూట్ జరిగిందట. కానీ ఫైనల్ గా ఈ సినిమా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. సమంత ఈ సినిమాలో అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోగా.. ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫార్మ్ చేసినట్లు సమాచారం. ఈమె తెలుగులో చేస్తున్న రెండో చిత్రం ఇదే కావడం గమనార్హం.

బాలీవుడ్ లో చాలానే సినిమాలు చేసిన ఈమె.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటించింది. RRR సినిమాలోనే ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఈమె.. తల్లిలాగే ముందు ముందు అనేక చిత్రాలు చేస్తుందని అంతా అనుకుంటున్నారు. తల్లిని మించి సూపర్ హిట్ చిత్రాలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











