మగధీర సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగు హీరోయిన్.. ఎందుకో తెలుసా?
రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2009లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం మొదటి రోజే 15 కోట్ల షేర్ ను రాబట్టుకుని ఆల్ టైం ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అయితే ఓ తెలుగు హీరోయిన్ ఈ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుంది. ముందుగా ఆమెను కలిసి ఈ సినిమా చేయమని అడిగితే జక్కన్నకే నిర్మొహమాటంగా నో చెప్పేసిందట. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లు అరవింద్ నిర్మాణంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్ తేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఫుల్ రన్ లో 60 కోట్లు వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో దేవ్ గిల్, సునీల్, శ్రీహరి, శరత్ బాబు, ఛత్రపతి శేఖల్, సలోని వంటి వాళ్లు నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించమని ఓ హీరోయిన్ కు ఛాన్స్ వచ్చింది. ఆమె మరెవరో కాదు.. నటి అర్చన.

అయితే అర్చనకు ఈ సినిమాలో సలోని పాత్రలో నటించమని నేరుగా దర్శకధీరుడు రాజమౌళియే వెళ్లి అడిగారట. కానీ అర్చన మాత్రం మొహం మీదే నో చెప్పేసిందట. అందుకు కారణం కూడా ఈ ముద్దుగుమ్మ వివరించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంటే తనకు మొత్తం అలాంటి ఆఫర్లే వస్తున్నాయని పేర్కొంది. అందుకే నో చెప్పాల్సి వచ్చిందని వెల్లడించింది. గతంలో సూపర్ డూపర్ హిట్టుగా నువ్వొస్తానంటే నేనొద్దాంటా సినిమాలో సెకండ్ రోల్ చేయడం వల్లే తనకు చాలా సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ పోయిందని వివరించింది.

తాను నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాలో లల్లీగా చేసి ఉండకపోతే ఓ బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రంలో హీరోయిన్ గా కనిపించేదానని బాధ పడింది. అలా హీరోయిన్ పాత్రలు మిస్ చేసుకున్న తనకు ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయాల్సిన అవసరం లేదని అనిపించిందని స్పష్టం చేసింది. అందుకే నేరుగా జక్కన్నే వచ్చి అడిగినా తాను నో చెప్పానని తెలిపింది. ఇందులో ఛాన్స్ వదులుకున్నందుకు తాను ఏమీ ఫీల్ అవ్వట్లేదని.. కానీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో చేయడం వల్ల గుర్తింపు వచ్చినా హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు మాత్రం చాలా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది.



Click it and Unblock the Notifications











