Samantha పాన్ ఇండియా స్టార్ మీద కన్నేసిన సమంత.. ఇంత ఓపెన్‌గా చెప్పేసిందేంటి?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ సినిమాలు చేయకపోయినా... ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక ఇటీవల పాడ్ కాస్ట్ ప్రారంభించిన సమంత.. తాజాగా ఆమె 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ 2024' కార్యక్రమంలో పాల్గొంది. న్యూదిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ తన క్రష్ హీరో ఎవరో చెప్పుకువచ్చింది. ఏకంగా పాన్ ఇండియా హీరో తన క్రష్ అంటూ రివిల్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.

ఏ మాయ చేశావే అంటూ తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా... మాకు మాత్రం సమంతనే ఫెవరేట్ అనుకునేలా చేసింది. తన చూపుతో మాయ చేస్తూ.. ఓ బేబీ అంటూ మనసు దోచేసింది. ఇక అక్కినేనివారి వారసుడు నాగచైతన్యతో ఏడు అడుగులు వేసింది. కానీ వీరి మజిలీ మధ్యలోనే ఆగిపోయింది. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్ కు షాకిచ్చారు. ఇక ఎవరి లైఫ్ వారు గడుపుతూ బిజీగా మారిపోయారు.

Do you know who Heroine Samantha crush is in the industry

ఇక మయోసైటిస్ బారిన పడిన తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చివరగా ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మరోవైపు సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌ గా ఉంటూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. తాజాగా సమంత 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ 2024' కార్యక్రమంలో పాల్గొంది. న్యూదిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు మీడియాతో మాట్లాడింది.

సమంత మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో రివిల్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ అంటే గౌరవమన్న సమంత... ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పై క్రష్ ఉందని చెప్పుకువచ్చింది. దీంతో బన్నీపై కన్నేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరి కాంబినేషన్ లో ఇప్పటికే సన్ ఆఫ్ సత్య మూర్తి అనే సినిమా వచ్చింది.

Do you know who Heroine Samantha crush is in the industry

ఇక ఆ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఊహు అంటావా అనే పాటలో బన్నీతో కలిసి స్టేప్పులు వేసింది. దీంతో ఈ బ్యూటీకి దేశవ్యాప్తంగా క్రేజ్ పాపులారిటీ వచ్చేశాయి. ఇక ఇదే పాపులారిటీ సమంత మళ్లీ యూజ్ చేసుకోవాలని బన్నీ తన క్రష్ అంటూ చెప్పుకువచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్. ఇదంతా క్రేజ్ కోసమే తప్ప నిజమైనది కాదంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రభాస్ అంటే ఎంతో గౌరవం అంటూ చెప్పుకువచ్చింది సమంత. తాను నటిగా కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్లు అయిందని.. రోజులో ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని అంటూ చెప్పుకువచ్చింది. శరీరానికి, మనసుకు బ్రేక్‌ ఇవ్వలేదని తెలిపింది. అనారోగ్యం కారణంగా కెరీర్లో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయినట్లు వివరించింది. ప్రస్తుతం సామ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X