జాన్వి కపూర్ కి ఇష్టమైన స్టార్ హీరో ఎవరో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా రేంజ్ లో దూసుకెళ్తోంది. ఒకవైపు నార్త్ లో సినిమాలు చేస్తూనే, మరోవైపు సౌత్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.. ఇప్పుడు సౌత్ స్టార్స్ సరసన నటిస్తూ ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటున్న జాన్వి కపూర్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వి కపూర్ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముందుగా బాలీవుడ్ లో సినిమాలు చేసి తన యాక్టింగ్ స్కిల్స్ తో పాటు గ్లామర్ తో కట్టిపడేసిన జాన్వి ఇప్పుడు సౌత్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మరో పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.

Do You Know Who is janhvi kapoor Fevorite Hero

అలాగే సౌత్ లో కూడా అడుగు పెట్టబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం మరోసారి వైరల్ అవుతుంది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే విజయ్ సేతుపతి మహారాజా మూవీ రిలీజ్ అవుతుండడమే అందుకు కారణం.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన జాన్వి కపూర్ ఫేవరెట్ హీరో మరెవరో కాదు మక్కల్ సెల్వన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి. ఈ విషయాన్ని జాన్వి కపూర్ గతంలో ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన ఫేవరెట్ అంటూ ఓ సందర్భంలో జాహ్నవి కపూర్ ఫుల్ గా ఎగ్జైట్ అయింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ విజయ్ సేతుపతి నటించిన నాను రౌడీ ధాన్ అనే సినిమా చూసి ఫిదా అయిపోయానని చెప్పింది. ఆ సినిమాని ఏకంగా 100 సార్లు చూసానని, ఆ తర్వాత విజయ్ సర్ నెంబర్ సంపాదించి, ఆయనకు ఫోన్ చేశానని చెప్పుకొచ్చింది. ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడంతో పాటు నేను మీకు పెద్ద అభిమానిని అంటూ విజయ్ సేతుపతితో మాట్లాడుతున్నప్పుడు తెగ సంబరపడిపోయిందట.

Do You Know Who is janhvi kapoor Fevorite Hero

అంతేకాదు మీతో కలిసి నటించే అవకాశం ఉంటే చెప్పండి అంటూ విజయ్ సేతుపతిని కోరిందట. అయితే సడన్ గా జాన్వి కపూర్ నుంచి ఫోన్ రావడంతో విజయ్ సేతుపతి ఆశ్చర్యపోతూ ఓ అవునా ! అని అనడం తప్ప పెద్దగా ఏమీ మాట్లాడలేదట.

కాగా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మహారాజా మూవీ జూన్ 14న రిలీజ్ కాబోతోంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో విజయ్ సేతుపతి తో పాటు మమతా మోహన్ దాస్, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X