సాయి పల్లవి క్రష్ ఎవరో తెలుసా?? ఆమె మనసు పారేసుకుంది ఎవరి మీదో కాదు..
సినీ పరిశ్రమల్లో ఎప్పటికపుడు చాలా మంది యువ హీరోయిన్స్ పరిచయం అవుతూ తమ మార్క్ ని సెట్ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంటారు. అలా ఇపుడు పలువురు యువ హీరోయిన్స్ యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అలాగే చాలా మందికి అయితే ఆ హీరోయిన్స్ క్రష్ గా అనుకుంటారు.
అలా ఇపుడు ఉన్న యువ హీరోయిన్స్ లో తన మొదటి సినిమా తోనే మంచి ఫేమ్ ని అందుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అని చెప్పాలి. కాగా సాయి పల్లవి మలయాళంలో వెండితెర ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమె తనకి మలయాళం ఒక్కటే కాకుండా తెలుగు తమిళ మార్కెట్ లలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని ఎంతోమందికి క్రష్ గా నిలిచింది.

అయితే ఇటీవల పలు అంశాల్లో కాంట్రవర్సీ కూడా సాయి పల్లవి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ రీసెంట్ గా వచ్చిన తమిళ సెన్సేషనల్ హిట్ సినిమా "అమరన్" తో అవన్నీ పక్కకి వెళ్లిపోయాయి. కాగా ఈ సినిమాతో కూడా ఎంతోమంది ఫెవరెట్ పాత్రల్లో ఒకటిగా తనది నిలిచిపోగా సాయి పల్లవిపై ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇపుడు వినిపిస్తుంది.
అయితే ఎంతోమందికి క్రష్ అయినటువంటి సాయి పల్లవి తనకి కూడా ఒక క్రష్ ఉన్నాడు అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది. కాగా తనకి ఎప్పుడు నుంచో అతడి మీద క్రష్ ఉంది అంటూ తమిళ నాట మీడియాలో చెప్పుకొచ్చింది. కాగా ఆమెకి అంతలా క్రష్ ఉన్న అతను ఎవరో కూడా కాదట. కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య అట. సూర్య అంటే తనకి క్రష్ అని చాలా మందికి కూడా తెలీదట.
కానీ దానిని ఆమెతో సూర్యతో కలిపి సినిమా చేసిన దర్శకుడు సెల్వ రాఘవన్ రివీల్ చేసాడని ఇంటర్వ్యూలో అడిగితే అది నిజమే అంటూ సాయి పల్లవి అసలు విషయం చెప్పింది. తన పెళ్లి లేదా బాయ్ ఫ్రెండ్ క్రష్ లు కోసం పెద్దగా ఎప్పుడూ చెప్పుకోని సాయి పల్లవికి ఇపుడు సూర్య అంటే క్రష్ అని విన్న ఆమె ఫ్యాన్స్ చిన్నగా హర్ట్ అవుతున్నారు.

సో మొత్తానికి సాయి పల్లవికి కూడా ఒక క్రష్ ఉన్నారన్నమాట. కాగా సాయి పల్లవి సూర్య కాంబినేషన్ లో దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన సినిమా "ఎన్ జి కె" అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. దీనితో ఇద్దరికీ ఆ సినిమా డిజప్పాయింటింగ్ ఎక్స్ పీరియన్స్ నే మిగిల్చింది అని చెప్పాలి.
మరి వీరి కాంబోలో మళ్ళీ ఏమన్నా సినిమా పడుతుందో లేదో చూడాలి. ఇక సాయి పల్లవి అమరన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో తండేల్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది. ఇక ఇంకో పక్క సూర్య తన అవైటెడ్ బిగ్గెస్ట్ సినిమా "కంగువా" రిలీజ్ తో రాబోతున్నారు. తాను కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ ని చేస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











