తిరుమలలో ప్రియుడితో జాన్వీ కపూర్.. ఇంతకు ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏ సీఎం మనవడో తెలుసా?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో ఇప్పటికే తనదైన మార్క్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొన్నది. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువ కానున్నది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 3 తేదీన తిరుమలలో జాన్వీ కపూర్ తన ప్రియుడితో ప్రత్యక్షం కావడం రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. అయితే జాన్వీ ప్రియుడు ఎవరు? ప్రియుడితోపాటు ఎవరితో తిరుమలలో స్వామి వారిని దర్శించకొన్నదనే విషయంలోకి వెళితే..

బాలీవుడ్ ఎంట్రీకి ముందే అఫైర్లు

బాలీవుడ్ ఎంట్రీకి ముందే అఫైర్లు

బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వక ముందే ఆమెకు సంబంధించిన అఫైర్ వార్తలు ముంబై మీడియాలో చక్కర్లు కొట్టాయి. శిఖర్ పహరియా, ఒర్హాన్ అవత్రామణితో ఆమె డేటింగ్ చేస్తుందనే వార్తలు వినిపించాయి. అయితే దఢక్ సినిమా సమయంలో ఇషాన్ కట్టర్‌తో అఫైర్ ఉందనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

శిఖర్ పహారియాతో జోరుగా డేటింగ్

శిఖర్ పహారియాతో జోరుగా డేటింగ్

అయితే గతంలో శిఖర్ పహరియాతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంలో జాన్వీ కపూర్ మునిగి తేలింది. ఆ తర్వాత తలెత్తిన అభిప్రాయ బేధాల కారణంగా వారిద్దరూ విడిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే కొద్దికాలం బ్రేకప్ జరిగిన తర్వాత మళ్లీ శిఖర్‌తో జాన్వీ రిలేషన్ మళ్లీ చిగురించింది. అప్పటి నుంచి శిఖర్‌తో అడపాదపా కనిపిస్తున్నది. మాల్దీవుల్లో శిఖర్; జాన్వీ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రియుడికి బర్త్ డే విషెస్

ప్రియుడికి బర్త్ డే విషెస్

అయితే శిఖర్ పహరియాతో ఉన్న రిలేషన్‌ గురించి ఏప్రిల్ 3వ తేదీన క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 3వ తేదీన బర్త్ డే జరుపుకొంటున్న శిఖర్‌కు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేసింది. హ్యాపీ బర్త్ డే శిఖూ అటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టంది. దాంతో పాటు ఎరుపు రంగు హార్ట్ కూడా పెట్టింది. ఆ తర్వాత వారిద్దరు దిగిన పాత ఫోటోను షేర్ చేసింది.

తిరుమలలో ప్రియుడితో కలిసి జాన్వీ

తిరుమలలో ప్రియుడితో కలిసి జాన్వీ

ఇక కట్ చేస్తే.. ఏప్రిల్ 3వ తేది (సోమవారం) ఉదయం తిరుమలలో జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియా, తన సోదరి ఖుషితో ప్రత్యక్షమయ్యారు. ఉదయం బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొన్నారు. ప్రధాన ద్వారం గుండా ఆలయం బయటకు వచ్చిన జానీ, శిఖర్, ఖుషి గుడి బయట ముగ్గురు సాష్టంగా నమస్కారం చేశారు. అనంతరం మీడియా మాట్లాడించేందుకు ప్రయత్నించగా మౌనంగా వెళ్లిపోయారు.

శిఖర్ పహారియా ఎవరంటే?

అయితే జాన్వీ కపూర్ డేటింగ్ చేస్తున్న శిఖర్ పహారియా ఎవరనే సందేహం అందరిని వెంటాడింది. శిఖర్ విషయానికి వస్తే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేకు మనవవడు. షిండే కొడుకు సంజయ్ పహారియా, స్మృతి పహారియా దంపతుల కుమారుడు. శిఖర్ తల్లిదండ్రులు 2008లో విడాకులు తీసుకొన్నారు.

జాన్వీ కపూర్ సినిమా కెరీర్..

జాన్వీ కపూర్ సినిమా కెరీర్..

ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. 2002లో గుడ్ లక్ జెర్రీ, మిలీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, NTR30 చిత్రాల్లో నటిస్తున్నది. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X