Punarnavi Bhupalam: పునర్నవి ప్రియుడుని చూశారా.. వన్ అండ్ ఓన్లీ లవ్ అంటూ ఫొటో షేర్!

పునర్నవి భూపాలాం.. అలియాస్ పున్నూ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పలు సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని రచ్చ చేసింది. ముఖ్యంగా అక్కడే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి చాలా క్లోజ్ గా ఉంటూ విపరీతమైన నెగిటివిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా అతడే ఈమె ప్రియుడు అన్నంత క్లోజ్ గా ఉండి.. బయటకు వచ్చాకా దూరం అయ్యారు. మొన్నీమధ్య ఓసారి కలవగా.. పెద్ద ఎత్తున ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు ఎవరో చెప్పేసింది. ముఖ్యంగా ఓ ఫొటో కూడా షేర్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన పనర్నవి భూపాలం 2013లో వచ్చిన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. సునీతగా కనిపించి అందరినీ తెగ అలరించింది. ఆమె చేసిన అద్భుతమైన నటనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలోనూ శర్వానంద్ కూతురుగా కనిపించి మెస్మైజ్ చేసింది. ఇక ఆ తర్వాత పిట్టగోడ, సైకల్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. 1996లో మార్చి 28వ తేదీన తెనాలిలో పుట్టిందీ ముద్దుగుమ్మ.

Do You Know Who is The Lover of Punarnavi bhupalam Check Details

2013 నుంచి ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ముందుకెళ్తోంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడిపి చాలా రోజుల పాటు ఇంట్లో కొనసాగింది. ఎక్కువగా వితికా శేరు, వరుణ్ సందేశ్... రాహుల్ సిప్లిగంజ్ లతో మాత్రమే ఉండి.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఆమె బిగ్ బాస్ లో ఉండగా.. ఆమె అందాలకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చేశారు. ఎవరూ ఊహించని స్థాయిలో అభిమానులను పొందిన ఈ ముద్దుగుమ్మ బయటకు వచ్చాక మాత్రం పెద్దగా కనిపించలేదు.

Do You Know Who is The Lover of Punarnavi bhupalam Check Details

తాము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకుంటూ తరిగిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిలు.. బయట మాత్రం పెదదగా కలవేదు. అలాగ్ బిగ్ బాస్ షో నుంచి వచ్చేశాకా.. ఆమె చదువుల పేరుతో విదేశాలకు వెళ్లిపోయింది. అక్కడే స్నేహితులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఓ అబ్బాయితో కలిసి చాలా క్లోజ్ గా దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే మై వన్ అండ్ ఓన్లీ లవ్ అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఆ ఫొటోలో ఉంది పున్ను ప్రియుడేనని అంటున్నారు. అయితే దీనిపై ఆమె స్పందించాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X