ఉప్పెనలో కృతిశెట్టి రోల్ మిస్ చేసుకొన్న హీరోయిన్ ఎవరో తెలుసా? బోల్డ్ సీన్లే కారణమంటూ.. రివీల్

చిత్ర పరిశ్రమ విచిత్రమైనది .. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్నిసార్లు ఎవరో చేయాల్సిన సినిమా మరెవరో చేస్తారు. తీరా ఆ మూవీ బ్లాక్‌బస్టర్ అయితే దానిని వదులుకున్న నటీనటులు బాగా డిజప్పాయింట్ అవుతారు. ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. ఛాన్స్ మిస్ చేసుకున్న వారు నెత్తి నోరు బాదుకోవడం తప్పించి ఏం చేయలేరు. ఇలాంటి పరిస్ధితిని ఓ స్టార్ హీరో కూతురు ఎదుర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌ను హీరోగా లాంచ్ చేయాలని అంతా అనుకున్నప్పుడు ఎన్నో కథలను అనుకున్నారు. చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్‌గా ఉప్పెనను సెలెక్ట్ చేశారు పెద్దలు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహించే బాధ్యతలు అప్పగించారు. దర్శకుడికి, హీరోకి ఇదే తొలి డెబ్యూ మూవీ కాగా.. కన్నడ కస్తూరి కృతిశెట్టికి ఇదే ఫస్ట్ తెలుగు సినిమా. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉప్పెనకు ఉన్నాయి.

do you know who missed the chance as a heroine in uppena movie check details

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్ కింద రూ.20.50 కోట్లు అందుకున్న ఉప్పెన .. రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. 2021 ఫిబ్రవరి 12న రిలీజైన ఈ సినిమా మౌత్ టాక్‌తో కేవలం మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది.

ఈ సినిమాతో కృతిశెట్టి కుర్రకారు గుండెలను కొల్లగొట్టి వరుస అవకాశాలు దక్కించుకుంది. నాని, నాగచైతన్య, నితిన్ తదితర హీరోలతో జత కట్టింది. టాలీవుడ్‌లో వచ్చిన పాపులారిటీతో కోలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు అందుకుని రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. నిజానికి ఇంతటి స్టార్ డమ్ దక్కాల్సింది కృతిశెట్టికి కాదు.. మరో అమ్మాయికి . తొలుత ఉప్పెన సినిమాలో హీరోయిన్‌గా ఆమెనే అనుకున్నారు మేకర్స్. కానీ ఆ అమ్మాయి నేను ఈ క్యారెక్టర్ చేయలేనంటూ తేల్చిచెప్పేసిందట.

do you know who missed the chance as a heroine in uppena movie check details

ఆమె ఎవరో కాదు.. యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఉప్పెన సినిమాలో హీరోయిన్‌గా బుచ్చిబాబు తనను సంప్రదించారని చెప్పింది. ఇందులో బోల్డ్ సీన్స్ ఉన్నాయని, తాను కంఫర్ట్‌గా ఫీలవ్వలేదని.. తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఈ సినిమాను చూడలేనేమోనని అనిపించిందని అందుకే ఉప్పెన ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు తెలిపింది. బుచ్చిబాబు తనకు చెప్పిన కథకు, సినిమాగా వచ్చిన కథకు చాలా మార్పులు జరిగాయని.. తనకు ముందే ఇలాంటి స్టోరీ చెప్పి ఉంటే ఖచ్చితంగా ఓకే చెప్పేదాన్నని శివానీ తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X