త్రిషతో పాటు బాయ్స్ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలుసా?
ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా బాయ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియాలు హీరోయిహీరోయిన్లుగా నటించి మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమా వల్ల వీరిద్దరికీ మంచి గుర్తింపే వచ్చింది. ఎవరూ ఊహించని స్థాయిలో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించున్నారు. అయితే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా జెనీలియాను అనుకోలేదట. వేరే ఇద్దరిని ఇందులో హీరోయిన్లుగా తీసుకోవాలనుకోగా వారిద్దరూ నో చెప్పారు. అలా ఈ చిత్రం జెనీలియకు వచ్చింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2003లో వచ్చిన బాయ్స్ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియాలతో పాటు భరత్, తమన్, మణికండన్, నకుల్, వివేక్, సెంధిల్, సాలమన్ పాపయ్య, సత్యన్ లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ ఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మొత్తం 7 పాటలు ఈ చిత్రంలో ఉండగా.. అన్నీ ఆల్ టైమ్ హిట్లుగా నిలిచాయి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, ఆలె ఆలె, సారీగమే, బూమ్ బూమ్, మారో మారో, ప్లీజ్ సర్.. వంటి పాటలన్నీ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా కాలేజీ చేసే వయసులోనే హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోవడం.. వీరికి ఓ బాబు పుట్టడం.. ఆ తర్వాత వీరు లైఫ్ ను ఎలా లీడ్ చేశారనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కుర్రకారును విపరీతంగా అట్రాక్ట్ చేసిన ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా త్రిషను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమెను తీసుకోలేకపోయారు. ఆ తర్వాత ఈ చిత్రంలో హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకోవాలని భావించారు.
నేరుగా డైరెక్టర్ శంకర్ యే వరలక్ష్మీ శరత్ కుమార్ వద్దకు వెళ్లి ఈ ఆఫర్ ఇచ్చారట. అయితే ఈ సినిమాలో నటించాలని తనకు కూడా బాగానే కోరిక ఉండగా.. ఆమె తండ్రి శరత్ కుమార్ మాత్రం వద్దు ఈ సినిమా చేయకు అని చెప్పారట. దీంతో ఏం చేయాలో పాలుపోని వరలక్ష్మీ శరత్ కుమార్.. తనకు ఇష్టం లేకపోయినా ఈ సినిమాకు నో చెప్పిందట. ఇలా త్రిషతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నారు.

అలా జెనీలియకు ఈ సినిమాలో అవకాశం దక్కగా.. ఆమె కెరియరే మారిపోయింది. ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇది మాత్రమే కాదండోయ్.. ఆ సినిమా తర్వాత సిద్ధార్థ్, జెనీలియా కాంబోలో వచ్చిన మరో క్రేజీ సినిమా బొమ్మరిల్లు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాల్లోని హరిణి, హాసిని పాత్రలను ఇప్పటికీ అంతా గుర్తు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











