మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?
మర్యాద రామన్న.. ఈ సినిమా గురించి తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిందీ చిత్రం. హీరో సునీల్ సరసన, సలోని హీరోయిన్ గా చేసిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా వేరే వాళ్లను తీసుకోవాలనుకున్నారట. ఇద్దరు స్టార్ హీరోయిన్లను అడిగారట. కానీ వాళ్లు ఈ సనిమాకు నో చెప్పగా ఆ అవకాశం సలోనికి దక్కింది. మరి ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ క్యూట్ బ్యూటీలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్కా మీడియా పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మించిన సినిమానే మర్యాద రామన్న. సునీల్, సలోని జంటగా నటించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. అలాగే సునీల్, సలోనిలతో పాటు నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావు రమేష్, ఎస్.ఎస్. కాంచి, సుబ్బరాయ శర్మ, కోసూరి వేణుగోపాల్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 2010 జులై 23వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ముఖ్యంగా తన ఇంటిగడప దాటేంతవరకు అతిథి ప్రాణాన్ని తీయని ఒక ఊరి పెద్ద ఇంటికి వెళ్ళి, తన తండ్రికీ ఆ పెద్దమనిషికీ తగాదాలున్నాయని తెలుసుకుని తన ప్రాణాలను కాపాడుకోవలనే ఒక యువకుడు కథను వివరించే ఈ సినిమా సునీల్ కి హీరోగా రెండో సినిమా. అదిరిపోయే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టగా.. అందరికీ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సునీల్ రేంజ్ చాలా వరకూ పెరిగిపోయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా ముందుగా వేరే అమ్మాయిలను తీసుకోవాలని అనుకున్నారట.

కథ రాసుకునేటప్పుడే రాజమౌళి.. ఈ సినిమాకు త్రిష లేదా అనుష్క శెట్టి అయితే బాగుంటుందని భావించారట. వాళ్లను దృష్టిలో ఉంచుకునే కథ రాయగా.. ఆ తర్వాత వారిని సంప్రదించారట. అయితే ఈ సినిమాలో హీరోగా సునీల్ అని చెప్పగానే వాళ్లు ఈ సినిమాక చేసేందుకు కాస్త వెనుకాడారట. ముందుగా ఈ సినిమా ఆఫర్ ను త్రిష దగ్గరకు తీసుకు వెళ్లగా.. చేస్తానని చెప్పిందట. కానీ ఆ తర్వాత మాత్రం నో చెప్పిందట. అలాగే టాలీవుడ్ క్యూట్ బ్యూటీ స్వీటీ కూడా అచ్చం ఇలాగే చేసిందట.

జక్కన్న ముందుగా ఆమెకు ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వగా ఆమె చేస్తానని చెప్పిందట. కానీ ఆ తర్వాత మాత్రం చేయలేనని తేల్చిందట. ఇలా ఇద్దరు హీరోయిన్లు.. సునీల్ హీరోగా చేయడం వల్లే తప్పుకున్నట్లు నేరుగా ఆయనే వివరించారు. అలా ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో త్రిష, అనుష్క శెట్టిలు అవకాశం వదులుకోగా.. సలోని అందిపుచ్చుకుని తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుకుంది.


Click it and Unblock the Notifications











