మాతృదేవోభవ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్ను ముద్దుగుమ్మ ఎవరంటే?
టాలీవుడ్ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో ఎప్పుడూ ముందుండే చిత్రం మాతృ దేవో భవ. సినిమా పేరు వింటేనే చాలు కళ్లలోంచి నీళ్ల వస్తుంటాయి చాలా మందికి. ఇక సినిమా చూసినా, అందులోని పాటలు విన్నా మూడు నాలుగు రోజులు మైండ్ లోంచి కూడా పోదీ చిత్రం. తల్లి ప్రేమను ఎంతో చక్కగా చూపించిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో తల్లి పాత్రలో మాధవి జీవించిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మాత్రం ఈమె కాదట. మరో తెలుగు హీరోయిన్ ను అనుకోగా ఆమె నో చెప్పిందట. అయితే ఆమె ఎవరు, ఎందుకు ఈ సినిమాకు నో చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1993లో వచ్చిన మాతృదేవో భవ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. టీవీల్లో ఈ సినిమా వస్తుందంటే చాలు చూసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించారు. అలాగే ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణిలు అద్భుతమైన పాటలు పాడి.. అందిరనీ ఉర్రూతలూగించారు.

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రధాన పాత్రలో మాధవి నటించింది. అలాగే నాజర్, నాజర్, తనికెళ్ల భరణి, చారుహాసన్, వై విజయ, నిర్మలమ్మ, కోట శ్రీనివాస రావులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ప్రేమించి పెళ్లాడిన భర్త మద్యానికి బానిసై, ఆ తర్వాత కళ్లు దుకాణపు యజమాని చేతిలో హత్యకు గురి కావడం.. అప్పుడే తనకు క్యాన్సర్ ఉందని తెలిసి తన పిల్లలు అనాథలు కాకుండా ఆమె తీసుకునే నిర్ణయం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.
తనలా తన నలుగురు పిల్లలు అనాథలు కాకూడదని, ముఖ్యంగా ఆశ్రమంలో పెరగకూడదని.. అందరినీ ఒక్కో ఇంటికి చేర్చడం.. దత్తతం ఇచ్చేయడం అధ్భుతంగా ఉంటుంది. ఈక్రమంలోనే వచ్చే వేటూరి సుందర్రామ్మూర్తి రాసిన రాలిపొయ్యే పువ్వా నీకు... అనే పాటకు జాతీయ పురస్కారం కూడా లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం అది రెండవ సారి కావడం గమనార్హం. ఇంత మంచి కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా జీవితా రాజశేఖర్ ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె మాత్రం ఈ సినిమాకు నో చెప్పింది.

అప్పటికే తాను హీరో రాజశేఖర్ ను ప్రేమించడం.. తన అత్తింటి వారి కోసం, మంచి కోడలు అనిపించుకోవడం కోసం ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. అందుకే ఇంత మంచి సినిమాలో అవకాశం వచ్చినా ఆమె చేయనని నిర్మొహమాటంగా చెప్పిందట. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆమె దగ్గరకు వెళ్లి చెప్పినా వినలేదట. చివరకు ఈ సినిమా మాధవి చేతికి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











