నాని జెర్సీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా వ వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా జెర్సీ గురించి అందరికీ తెలిసిందే. 2019లో వచ్చి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 2021లో 67వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైన ఈ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ శ్రద్ధా శ్రీనాథ్ కాదంట. మరి ఈ బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రంలో అవాకశం మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జెర్సీ సినిమాలో నాని ప్రియురాలిగా శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ ఇరగదీసింది. ప్రియురాలిగానే కాకుండా భార్యగా, ఓ బాబుకి తల్లిగా చాలా హుందాగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. నాని చనిపోయిన తర్వాత కొడుకు పెద్దవడం.. అప్పుడు చాలా పెద్దావిడగా కూడా శ్రద్ధా శ్రీనాథ్ చాలా బాగా నటించింది. అంతటి అద్భుతమైన పాత్రలో కనిపించి తెలుగు సినీ ప్రియుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకుందీ క్యూట్ బ్యూటీ. ఇంత మంచి పాత్రలో మెస్మరైజింగ్ యాక్టింగ్ తో ఇరగదీసిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ చాయిస్ కాదు.

జెర్సీ సినిమాలో ముందుగా హీరోయిన్ గా రెబా మోనికా జాన్ ను తీసుకోవాలని అనుకున్నారట. అయితే అప్పటికే ఈ ముద్దుగుమ్మ తమిళంతో పాటు మలయాళంలో పలు సినిమాలకు ఓకే చెప్పడం.. డేట్లు కుదరక ఈ ముద్దుగుమ్మ నాని పక్కన నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే అలా రెబా మోనికా జాన్ ఈ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకోగా.. శ్రద్ధా శ్రీనాథ్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తన అందం, అభినయంతో అందరినీ అలరించి పెద్ద ఎత్తున అభిమానులను సంపాధించుకుంది.
మరోవైపు ఛాన్స్ మిస్ చేసుకున్న రెబా మోనికా జాన్ ఆ తర్వాత బ్రో సినిమాలో కూడా అవకాశాన్ని వదులుకుంది. పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ వదులుకున్న ఈ క్యూట్ బ్యూటీ శ్రీవిష్ణు సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన చిత్రంలో మెరిసి సూపర్ డూపర్ హిట్టు అందుకుంది.

మొదటి సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్న ఈమె ముందు వదులుకున్న చిత్రాల్లో నటిస్తే మరింత క్రేజ్ వచ్చి ఉండేదని.. చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా లేట్ గా ఎంట్రీ ఇచ్చిన అదిరిపోయే సినిమాతో వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసింది. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది.


Click it and Unblock the Notifications











