నరసింహ సినిమాలో సౌందర్య పాత్రను మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?
1999లో రజినీ కాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా దారి రహదారి.. అంటూ స్టైలిష్ లుక్ కనిపిస్తూ.. రమ్యకృష్ణను రఫ్పాడించిన రజినీ కాంత్ రూపం ఇప్పిటకీ తెలుగు సినీ ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతుంది. అలాగే రమ్యకృష్ణ మొండితనం.. సౌందర్య సుకుమారత్వం కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ గా ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్యకు ఫస్ట్ ఛాయిస్ ఆమె కాదట. మరి ఎవరు ఈ అద్భుతమైన ఛాన్స్ ను మిస్ చేసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ నరసింహ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో స్టార్ హీరోహీరోయిన్లు నటించారు. రజినీకాంత్, శివాజీ గణేషన్, రమ్యకృష్ణ, సౌందర్య, లక్ష్మీ, నాజర్, ప్రీత విజయకుమార్, అబ్బాస్, ప్రకాష్ రాజ్, నాజర్, సితార, రాధారవి వంటి వాళ్లంతా ఈ సినిమాలో కనిపించి సందడి చేశారు. అయితే నరసింహ మరదలిగా.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ గర్ల్ గా రమ్యకృష్ణను నటనను ఇరగదీశారు. అలాగే సౌందర్య కూడా చాలా సుకుమారంగా కనిపిస్తూ రజినీ కాంత్ మనసు దోచిన అమ్మాయింగా మరింత అద్భుతమైన నటనను కనబర్చారు.

అయితే చాలా సౌమ్యంగా పద్ధతైన అమ్మాయిగా కనిపించిన సౌందర్య పాత్ర కోసం ముందుగా మీనాను సంప్రదించారట. కానీ ఆమె అప్పటికే అనేక సినిమాలకు ఓకే చెప్పడం, డేట్లు కుదరకపోవడంతో నో చెప్పిందట. తనకు ఆ స్టోరీ బాగా నచ్చినప్పటికీ తాను ఓకే చెప్పడానికి లేకుండా పోయిందట. అలా తను ఆ ప్రాజెక్టును వదులుకుందట. అలాగే ఈ సినిమాలో సౌందర్య పాత్రకే కాకుండా రమ్యకృష్ణ పాత్రకోసం కూడా ఆమెను అడిగారట. కానీ దానికి కూడా తన వద్ద డేట్లు లేక మళ్లీ ఛాన్స్ మిస్ చేసుకుందట. రెండుసార్లు.. రెండు పాత్రల కోసం అవకాశం వచ్చినా అందిపుచ్చుకోలేకపోయినట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అలాగే తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడే సినిమాల్లోకి రావడంతో తనకు చాలా ప్లస్ అయిందని చెప్పుకొచ్చింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల అందరి సరసన బాల నటిగా కనిపించిన ఈమె.. పెద్దయ్యాక వారి చెంతనే ఆడి పాడినట్లు కూడా వివరించింది. తన అదృష్టం, టాలెంట్ వల్ల అనేక సినిమాలు చేయగల్గానని.. అదంతా తన అదృష్టం అని వివరించింది. ఇంకా తన జీవితం గురించి మరెన్నో విషయాల గురించి చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











