పెళ్లిసందD సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న తెలుగమ్మాయి ఎవరో తెలుసా?

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2021లో వచ్చిన క్యూట్ సినిమానే పెళ్లి సందD. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా చేసిన తొలి చిత్రం ఇదే. మొదటి సినిమాలోనే తన అందం, అభినయం కనబర్చి లక్షలాది మంది అభిమానుల్ని సంపాధించుకున్న ఈమె.. ప్రస్తుతం అనేక సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. తనకు లక్కీ ఛాన్స్ గా మారిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ ముద్దుగుమ్మ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఆ తెలుగు అందం ఎవరు, ఎందుకు ఈ అవకాశాన్ని మిస్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన తొలి సినిమా పెళ్లి సందD. గతంలో ఇదే పేరుతో శ్రీకాంత్ హీరోగా ఓ సినిమా రాగా.. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మరోసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చిన ఈ సినిమాను ఆర్కా మీడియా. ఆర్.కె అసోసియేట్స్ బ్యానర్ పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. దర్శకడుడిగా కే రాఘవేంద్రరావు పేరు చెబుతున్నా.. ఆయన పర్యవేణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

 Do You Know Who Missed The Chance in PelliSandaD Movie Check Details

రోషన్‌ తో పాటు శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న 2021లో విడుదల అయింది. అనుకున్న స్థాయిలో హిట్టు కాకపోయినప్పటికీ.. హీరోహీరోయిన్లకు మంచి గుర్తింపే వచ్చింది. అలా వచ్చిన ఫేమ్ తోనే శ్రీలీల అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఉన్న పెద్ద పెద్ద హీరోల అందరి సరసన అవకాశం అందిపుచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ తెలుగు అమ్మాయి ఛాన్స్ మిస్ చేసుకుంది.

 Do You Know Who Missed The Chance in PelliSandaD Movie Check Details

బాలనటిగా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన క్యూట్ బ్యూటీ, అచ్చమైన తెలుగు అమ్మాయి కావ్య కళ్యాణ్ రామ్. అయితే ఈమె సినిమాల్లోకి రావాలని నిశ్చయింకుని డైరెక్టర్ కే రాఘవేంద్రరావుకు ఫోన్ చేసిందట. ఒక రెండు నెలల ముందు నాకు ఈ విషయం తెలిసి ఉంటే పెళ్లి సందD సినిమాలో హీరోయిన్ గా నిన్నే తీసుకునేదాన్ని అన్నారట. అసలు హీరోయిన్ కావాలని నువ్వెప్పుడు అనుకున్నావని అడిగారట. అందుకు కావ్య ఇప్పుడే అనుకున్నాను.. అనుకోగానే మీకే చెప్పాలని ఫస్ట్ మీకే చెబుతున్నానని చెప్పిందట.

 Do You Know Who Missed The Chance in PelliSandaD Movie Check Details

తన ఫోన్ చేసి చెప్పిన నాలుగు, ఐదు రోజుల తర్వాతే ఈ పెళ్లి సందD సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని కావ్య కళ్యాణ్ రామ్ వెల్లడించింది. కాస్త ముందుగా చెప్పి ఉంటే ఆ సినిమాలో తానే చేసేదాన్నని... కానీ ఆ అవకాశాన్ని మిస్ అయినందుకు తాను చాలా పీల్ అయినట్లు చెప్పుకొచ్చింది. సినిమా హిట్ అయిందని కాదని.. కానీ రాఘవేంద్రరావుతో పని చేసే అవకాశాన్ని మిస్ అయినందుకు చాలా బాధ పడినట్లు తెలిపింది. కానీ ఈ ముద్దుగుమ్మ కూడా ప్రస్తుతం అద్భుతమై అవకాశాలు దక్కించుకుంటూ మంచి మంచి సినిమాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X