పోకిరి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ ఎవరు, ఎందుకో తెలుసా?

మహేష్ బాబు హీరోగా వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం పోకిరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోలోని డైలాగ్ లు, పాటలను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఓ బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని అనుకున్నారట. మరి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ క్యూట్ బ్యూటీ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2006 ఏప్రిల్ 28వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు నేటితో 18 ఏళ్లు. సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ బాబు, ఇలియానాలు హీరోహీరోయిన్లుగా చేయగా.. ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, నాజర్, ఆశిష్ విద్యార్థి, వేణు మాధవ్, పెనుమత్స సుబ్బరాజు, ముమైత్ ఖాన్, అజయ్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన తెలుగు సినిమాగా సెన్సేషన క్రియేట్ చేసి ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది.

Do You Know Who Missed The Chance in Pokiri Movie Check Details

మగధీర సినిమా విడుదల అయ్యే వరకు ఈ తెలుగు చిత్రం చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మానే తినేస్తారా అనే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. అలాగే బ్రహ్మీ కామెడీ కూడా సూపర్. అంతేకాకుండా మహేష్ బాబు, ఇలియానాల రొమాన్స్ అయితే సూపరో సూపర్. ఇలా క్రేజీ కాంబోతో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా మరో బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని అనుకున్నారట.

ముఖ్యంగా ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ కంగనా రనౌత్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. ఇందుకోసం ఆమె ఆడిషన్ కూడా ఇచ్చిందట. అది ఓకే చేసిన పూరీ జగన్నాథ్ ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. కానీ కంగనా మాత్రం ఈ సినిమా కంటే ముందు గ్యాంగ్ స్టర్ అనే సినిమాకు ఆడిషన్ ఇచ్చిందట. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఒకేసారి ఉండడం.. వీటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సి ఉండడంతో కంగనా గ్యాంగ్ స్టర్ సినిమాకే ఓకే చెప్పిందట. అలా పోకిరి సినిమాలో అవకాశాన్ని వదుకుంది.

Do You Know Who Missed The Chance in Pokiri Movie Check Details

దీని తర్వాత చాలా వెతకి మరి ఇలియానాను హీరోయిన్ గా తీసుకున్నారట దర్శక, నిర్మాతలు. ఇలా ఈ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న ఇలియానా తన అందం, నటనతో ఇరగదీసింది. ఇలా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ విపరీతమైన గుర్తింపు వచ్చింది. మీరూ కూడా ఓసారి ఈ క్రేజీ మూవీని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X