ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న క్యూట్ బ్యూటీ ఎవరో తెలుసా?
ప్రేమిస్తే.. ఈ సినిమా పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన అందరినీ మనసుల్లో నిలిచిపోయిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసిన మూడు నాలుగు రోజుల వరకు చాలా మంది ఆ ధ్యాసలోంచి బయటకు రాలేకపోయారు. అలాంటి అద్భుతమైన సినిమాలో నటించిన వారికి అయితే వచ్చిన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ ముద్దుగుమ్మను అనుకోగా.. ఆమె నో చెప్పిందట. అయితే ఈ క్రేజీ మూవీలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఈమె ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2004లో డిసెంబర్ 17వ తేదీన విడుదల అయిన ప్రేమిస్తే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భరత్, సంధ్యలు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాకు బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించారు. అలాగే శంకర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. విజయ్ మిల్టన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. శశికుమార్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. భరత్, సంధ్యలతో పాటు.. సుకుమార్, దండపాణి, శరణ్య నాగ్, కృష్ణ మూర్తి, సూరి, శివకుమార్, ఎలాంగో కుమార్ వేల్, రాక్ స్టార్ రమణి, శ్రీధర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

ఈ సినిమాలో హీరోగా చేసిన భరత్ కు అయితే.. ప్రేమిస్తే భరత్ అనే పేరు వెచ్చింది. ఇలా సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఈయనకు ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా.. ఓ అమ్మాయిని అనుకున్నారట. ముఖ్యంగా సంథ్యను తీసుకోవాలని అనుకలేదట. హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.

కానీ ఈ సినిమా చేయొద్దని తన తండ్రి చెప్పగా.. ఆమె ఈ సినిమాకు నో చెప్పాల్సింది వచ్చిందట. అలా ఈ సినిమాలో అవకాశం వదులుకున్న ఈమె.. ఆ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత కాస్త ఫీల్ అయినట్లు చెప్పింది. అయితే అప్పుడు తనకు సంబంధించిన విషయాలు అన్నీ తండ్రే చూసుకునేవాడని.. కానీ ప్రస్తుతం అన్నీ నిర్ణయాలు తానే తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తాను తీసుకునే నిర్ణయాల వల్ల ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా తానే చూసుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం శబరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలోనే ఈ విషయాలు అన్నీ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











