సీతారామం సినిమాలో సీత పాత్ర మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ ఎవరంటే?
సీతా రామం.. ఈ సినిమా పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అద్భుతమైన కథతో వచ్చి అందిరినీ మెస్మరైజ్ చేసిన ఈ సూపర్ డూపర్ హిట్టు చిత్రం ఏంటే ఇప్పటికీ చాలా మందికి ఇష్టం. హను రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలు, మాటలు, నటన.. ముఖ్యంగా సీత, ఆమె చీరకట్టు, రామ్ గా దుల్కర్ యాక్టింగ్.. వీటన్నిటినీ ఎవరూ మర్చిపోలేరు. ఇలాంటి సెన్సేనల్ సినిమాకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ మృణాల్ ఠాకూర్ కాదంట. మవరెవరు, ఎందుకు ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2022లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సీతా రామం సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ లు హీరోహీరోయిన్లుగా నటించారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, హీరో సుమంత్ లు ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ మృణానిలి ఠాకూర్ సీతగా జీవించేసిందనే చెప్పాలి. సినిమా మొత్తానికి ఆమె పాత్రే హైలెట్.

ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ తన అందం, అభినయంతో అందరినీ కట్టి పడేసింది. ఈ సినిమాలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరి మనసుల్లో సీతగా నిలిచిపోయింది. సంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీర కట్టులో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ రూపాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరవలేకపోతున్నారు. అంత మంచి పాత్రలో ఒదిగిపోయిన ఈ బ్యూటీ ఈ సినిమాకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా వేరే అమ్మాయిని తీసుకోవాలని డైరెక్టర్ హను రావిపూడి అనుకున్నారట.
పొడుగు కాళ్ల సుందరి, బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్ట్ అనుకున్నారట. ఆమెతో చర్చలు కూడా చేశారట. కానీ డైరెక్టర్ కు మాత్రం ఈమెకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమాలో సీత పాత్ర అంత వర్కౌట్ కాదని డౌట్ ఉండేదట. ఆమె సీతగా ఆకట్టుకుట్టుందో లేదోననే భయం ఉండడంతో.. ఎవరైనా కొత్త అమ్మాయి.. అందులోనూ మంచిగా నటించే అమ్మాయి దొరికితే బాగుండని చాలానే ప్రయత్ననాలు చేశారట. అప్పటి వరకు పూజాను హోల్డ్ లోనే పెట్టారట.

ఇలా చూస్తున్న సమయంలోనే తన స్నేహితుడు ఒకరు.. సూపర్ 30 సినిమాలో మృణాల్ ఠాకూర్ అనే అమ్మాయి ఉంటుంది చూడమని చెప్పగా.. ఆమె పెద్దగా కనిపించలేదట. కానీ ఓసారి నేరుగా వెళ్లి ఆమెతో మాట్లాడక తన సినిమాలో సీత పాత్రకు ఆమే న్యాయం చేస్తుందని ఫిక్స్ అయిపోయారట. అలా ఆమెను హీరోయిన్ గా తీసుకుని తన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఇప్పటికీ మృణాల్ పేరు తన ఫోన్ లో సీత అనే ఫీడ్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











