Tillu Square సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ ఎవరు, ఎందుకో తెలుసా?
గతంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో టిల్లు గాడి స్టైల్, డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అలా వచ్చిన క్రేజ్ తోనే ఈ సినిమాకు పార్ట్ 2ను కూడా తీసుకు రాబోతున్నారు. అయితే ఈ సారి మాత్రం హీరోయిన్ ను మార్చేశారు మూవీ టీం. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఉండగా... ముందుగా వేరే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారుట. ఆమె నో చెప్పడం వల్లే అనుపమ ఈ అవకాశాన్ని అందిప్చుచుకుందట. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కనిపిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐరేని మురళీధర్ గౌడ్ తో పాటు, నేహా శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేసినప్పటికీ.. వాయిదా పడుతూ వస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని మార్చి 29వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, గ్లింప్స్, మోషన్ పోస్టర్ లు చూస్తుంటే... కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనిపిస్తోంది. అంతా అదే నమ్మకంతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ అనుపమ కాదట. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.
అనుకోవడం కాదు.. ఆమె దగ్గరకు వెళ్లి ఆఫర్ ఇవ్వగా.. ముందుగా ఆమె కూడా ఓకే చెప్పిందట. కొంచెం సినిమా కూడా షూటింగ్ అయ్యాక ఈ సినిమా నేను చేయలేనంటూ సారీ చెప్పి తప్పుకుందట. అయితే అందుకు కారణాలు ఏంటనేవి మాత్రం అస్సలే బయటకు రాలేదు. కానీ శ్రీలీల నో చెప్పిన తర్వాత ఈ ఆఫర్ అనుపమ దగ్గరకు వెళ్లగా.. ఆమె కూడా చాలా టైమ్ తీసుకుని ఓకే చెప్పిందని తెలుస్తోంది. శ్రీలీల నో చెప్పడానికి, అనుపమ టైమ్ తీసోకవడానికి ఒకటే కారణం అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ లు ఎక్కువగా ఉండడం, అందులోనూ గ్లామర్ షో అధికంగా ఉండండతో శ్రీలీల చేయలేనని అనిందట. మరీ ఇంత ఘాటు లిప్ లాక్ సీన్లు ఉంటే తన ఇమేజ్ ఏమవుతుందోనని భావించి సినిమా నుంచి తప్పుకుందట. అలాగే అనుపమ కూడా ఇదే భయంతో చాలా ఆలోచంచి.. చివరకు ఓకే చెప్పిందట. పోస్టర్ లు, గ్లింప్స్ లోనే ఓ రేంజో రొమాన్స్ ఉంది. మరి సినిమాలో ఇంకే రేంజ్ లో రొమాన్స్ ఉందో.. అందుకే శ్రీలీల నో చెప్పిందంటూ ఇప్పుడు టాక్ నడుస్తోంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది.


Click it and Unblock the Notifications











