ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్లుగా వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన సినిమా ఉప్పెన. 2001లో విడుదల అయిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్లు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ముఖ్యంగా హీరోయిన్ కు తండ్రి పాత్రలో ఇరగదీశారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
2021వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాగా.. ఎప్పిల్ 14వ తేదీన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఆశిగా వైష్ణవ్ తేజ్, సంగీత శృతి అలియాస్ బేబమ్మగా కృతి శెట్టి, విజయ్ సేతుపతి బేబమ్మ తండ్రిగా, గాయత్రి జయరామన్ తల్లిగా నటించారు. బాక్సాఫీసు వద్ద 84 కోట్ల రూపాయలు అందుకున్న ఈ చిత్రం.. 69వ జాయీత చలన చిత్ర అవార్డుల్లో.. జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డుకు కూడా ఎంపిక అయింది.

అయితే ఈ చిత్రంలో బేబమ్మగా ఇరగదీశిన అందాల తార కృతి శెట్టి ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ కాదని తెలుస్తోంది. కృతి శెట్టికి బదులుగా... ముందుగా శివాని రాజశేఖర్ ను చిత్రబృందం కలిసిందట. అయితే ఆమె మాత్రం ఈ సినిమాకు నో చెప్పేసింది. అయితే తాను ఎందుకు ఈ సినిమాకు నో చెప్పిందో కూడా వివరించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో తాను కంఫర్ట్ గా ఫీలవ్వలేదని.. ఫ్యామిలీతో అంటే తన తల్లితండ్రులు, సోదరితో కలిసి ఈ చిత్రాన్ని చూడలేకపోతానని ఫీలైనట్లు భావించిందట. అందుకే ఈచిత్రానికి శివాని రాజశేఖర్ నో చెప్పిందట.

అయితే డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చి తనకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు.. ప్రస్తుతం చూస్తున్న కథకు చాలా మార్పులు ఉన్నాయని శివాని రాజశేఖర్ వెల్లడించింది. తనకు ముందే ఇలాంటి కథ చెప్పి ఉంటే కచ్చితంగా ఓకే చెప్పేదాన్ని కావచ్చు అని కూడా శివాని రాజశేఖర్ వెల్లడించింది. ఇంత మంచి పాత్రను వదులుకున్న ఈ క్యూట్ బ్యూటీ ఇటీవలే కోటబొమ్మాళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో థియేటర్ల వద్ద బాగానే సందడి చేస్తోంది. మీరూ ఓసారి ఆ సినిమాపై లుక్కేయండి.



Click it and Unblock the Notifications











