RX 100 సినిమాకు నో చెప్పిన యంగ్ హీరో ఎవరు, ఎందుకో తెలుసా?
ఆర్ఎక్స్ 100.. ఈ సినిమా పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. అద్బుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ గట్టి సర్ ప్రైజ్ ఇచ్చిందీ స్పెషల్ మూవీ. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా చేసిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ల పర్ఫార్మెన్స్ అయితే నెక్ట్స్ లెవెల్ అనే చెప్పొచ్చు. వీరిద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సన్నివేషాలు.. ప్రేమకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ క్రేజీ మూవీకి హీరోగా ముందుగా వేరే యంగ్ హీరోను అనుకున్నారట. కానీ ఆయన నో చెప్పడంతో ఈ సినిమా కార్తికేయ చేతికి వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ కుర్ర హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అజయ్ భూపతి దర్శకత్వంలో 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిందీ సినిమా. కానీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అలా సూపర్ హిట్ గా మారి రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా తెలుగు కుర్రాళ్లంతా ఈ సినిమాను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ క్రేజీ మూవీలో కార్తికేయ గుమ్మకొండ, పాయల్ రాజ్ పుత్ లు హీరోహీరోయిన్లుగా చేయగా.. రావు రమేష్, రాంకీ, లక్ష్మణ్ మీసాలలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

చేతన్ భరద్వాజ్ అదిరిపోయే మ్యూజిక్ అందించగా.. కెఎల్ ప్రవీమ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. రామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. అశోక్ రెడ్డి గుమ్మకొండ ప్రొడ్యూస్ చేశారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ పాటలు పాడారు. ఈ సినిమాలోని పిల్లా రా పాట అయితే ఇప్పిటకీ అందరికీ ఫేవరెట్ సాంగ్. అయితే ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాలో హీరోను ఫిక్స్ చేసుకున్నారట. ఓ కుర్రాడిని మనసులో పెట్టుకుని ఈ సినిమా కథ రాశారట. ఆ తర్వాత నేరుగా ఆయన వద్దకు వెళ్లి కథ కూడా చెప్పారట.
కానీ ఆయన ఈ సినిమాకు కథకు వెంటనే నో చెప్పారట. గతంలో ఆయన చేసిన ఓ సినిమాను పోలే ఈ సినిమా కూడా ఉండడంతో.. వర్కౌట్ కాదని భావించారట. అయితే ఆ యంగ్ హీరో మరెవరో కాదు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. గతంలో ఆయన చేసిన ఆర్జున్ రెడ్డి సినిమాను పోలే ఈ సినిమా కూడా ఉందని అన్నారట. అందుకే ఈ సినిమాలో నటించలేనని చెప్పగా.. అజయ్ భూపతి వెనక్కి వచ్చేశారట.

అలా ఈ కథను కార్తికేయకు వినిపించగా.. ఆయన ఓకే చెప్పడంతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇలా పెద్దగా అంచనాలు నమోదు చేయకుండానే థియేటర్లలోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సినిమా. ఇప్పటికీ ఈ సినిమాను విపరీతంగా ఇష్టపడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ కు కూడా విపరీతమైన గుర్తింపు వచ్చింది.


Click it and Unblock the Notifications











