గీతాగోవిందం సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ యాక్ట్రెస్.. ఎవరో, ఎందుకో తెలుసా?
గీతాగోవిందం.. ఈ సినిమా పేరు వింటేనే చాలా మంది తెగ బ్లష్ అయిపోతుంటారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన అందరి మనసుల్లో నిలిచిపోయిన ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. 2018 ఆగస్టు 15వ తేదీన విడుదల అయిన ఈ చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చింది.
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండలు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ చిత్రంలో నిత్యా మీనన, సుబ్బరాజు, నాగేంద్రబాబు, మౌర్యాని, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ లతో పాటు నవీన్ బేతిగంటి కూడా నటించి మెప్పించారు. హీరో విజయ్ దేవరకొండ అయితే మేడమ్, మేడమ్ అంటూ రష్మిక మందన్నా వెంట తిరగడం అందరినీ ఆకట్టుకుంది. రష్మిక కూడా ముందుగా కోపంగా ఆ తర్వాత హీరోపై ప్రేమను తనలోనే దాచుకుంటూ చూపించిన తీరుకు అంతా ఫిదా అయిపోయారు. హీరోయిన్ గా చక్కగా కనిపించి మెప్పించిన ఈమె ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ కాదంట.

డైరెక్టర్ పరుశురామ్ ఈ సినిమాకు హీరోయిన్ గా ముందుగా మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె మాత్రం ఈ సినిమా కథ విన్న తర్వాత తాను చేయనని చెప్పిందట. కథ బాగానే ఉన్నప్పటికీ.. ఇందులో లిప్ లాక్ సీన్స్ ఉండడం వల్ల ఆమె నో చెప్పిందట. అలాంటి సీన్లలో నటించడానికి తాను ఏమాత్రం రెడీగా లేనని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఇలా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ గీతా గోవిందం సినిమాను దూరం చేసుకుంది లావణ్య త్రిపాఠి.

అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తోంది. ఏడాదికో సినిమా చేస్తూ వస్తున్న ఈమె ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. పెళ్లికి ముందే కిస్సింగ్ సీన్లకు నో చెప్పిన ఈమె పెళ్లి తర్వాత ఎలాంటి క్యారెక్టర్లలో కనిపిస్తుందో చూడాలి మరి. పెళ్లికి ముందులాగా ఇలాంటి సన్నివేషాలకు దూరంగా ఉంటుందా లేక ఎలాంటి సీన్లు అయినా చేసి స్టార్ హీరోయిన్ గా మారుతుందా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











