రోజా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ నటి.. మూవీ చూశాకా ఏం చేసిందంటే?

రోజా.. ఈ సినిమా పేరు వింటే చాలు చాలా మందికి అర్వింద్ స్వామి, మధుబాలలు మదిలో మెదులుతారు. అద్బుతమైన కాన్సెప్ట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు టీవీలో వచ్చినా సరే కచ్చితంగా చూస్తూ విపరీతంగా టీఆర్పీని పెంచేస్తుంటారు. ఇలాంటి సినిమాలో హీరోయిన్ గా కనిపించి కుర్రకారు కలల రాణిగా మారిన మధుబాల పాత్రలో ముందుగా వేరే హీరోయిన్ ను అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పిందట. ఆ తర్వాత థియేటర్లో సినిమా చూసిన ఆమె చెప్పుతో తనను తాను కొట్టుకుందట. ఇలా ఇంత మంచి సినిమాను మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ది గ్రేట్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 1992లో రోజా సినిమా వచ్చింది. ఇందోల అర్వింద్ స్వామి హీరోగా చేయగా.. మధుబాల హీరోయిన్ గా చేసింది. అలాగే నాజర్, పంకజ్ కపూర్, వైష్ణవి, వైష్ణవి అరవింద్, జనగరాజ్, శివ రిందాని, స్రీవిద్య, సత్యప్రియ, రాజు సుందరం, సుజిత, విజయ చంద్రిక వంటి వాళ్ల ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇలా అద్భుతమైన నటీనటులతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ముందుగా తమిళంలో తెరకెక్కించారు.

Do you Know Who Missed THe Heroine Chance in Roja Movie Check Detials

కానీ ఈ సినిమా అద్భుతంగా ఉండడంతో తెలుగుతో సహా హిందీ, మళయాళం, మరాఠీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు. ఇలా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను మణిరత్నం, బాల చందర్ లు నిర్మించారు. అయితే తమిళంలో ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు హీరోయిన్ గా ముందుగా ఐశ్వర్యా భాస్కరన్ ను తీసుకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆమె వద్దకు వెళ్లి చెప్పారట డైరెక్టర్ మణిరత్నం.

కానీ ఆమె అప్పటికే అనేక సినిమాలు ఒప్పుకుని ఉండడం, చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాకు నో చెప్పిందట. అలా ఈ సినిమా అవకాశాన్ని మధుబాల అందిపుచ్చుకోవడంతో సినిమా పూర్తి అయి థియేటర్లలో విడుదల అయింది. అయింది చిత్రం విడుదలకు ముందే ఈ పాటలు విన్న ఐశ్వర్యా భాస్కరన్ చాలా ఫీల్ అయిందట. ఇంత మంచి పాటలు ఉన్న సినిమాను నేను మిస్ అవ్వడం ఏంటంటూ బాధ పడిందట. సినిమా విడుదల అయిన రోజు తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లిందట.

Do you Know Who Missed THe Heroine Chance in Roja Movie Check Detials

సినిమా మొత్తం చూసిన ఆమె మాట్లాడకుండా ఇంటికి వచ్చిందట. ఆమె మొహంలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు కూడా ఇంటికి చేరుకునే వరకు ఆమెను మాట్లాడించలేదట. కానీ ఇంటికి చేరుకున్న వెంటనే తలుపులు తీసిన ఐశ్వర్యా భాస్కరన్.. రోజా సినిమాలో హీరోయిన్ పాత్రను వదులుకున్నందుకు తన చెప్పు తీసుకుని తనను తానే కొట్టుకుందట. విపరీతంగా కొట్టుకుంటూ బాగా ఏడ్చిందట. ఆమే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X