Nayanathara: షారుక్‌కు ముఖం చాటేసిన నయనతార.. సూపర్‌స్టార్లను లెక్కచేయని స్టార్ హీరోయిన్!

లేడి సూపర్ స్టార్ నయనతార ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు... ఆమెకు హీరోలతో సమానంగా క్రేజ్ అయితే ఉంటుంది. ఇక ఈ భామ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది. ఇక ఇటీవల ఈ జంట కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నయన తార చేసే సినిమాలు ఏవైవా.. హీరో ఏ సూపర్ స్టార్స్ అయినా.. ఆమె మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనదు. చిరంజీవి, బాలకృష్ణ, రజినీ కాంత్, షారుఖ్.. ఎవరైనా సరే.. ఈ అమ్మడు మాత్రం ప్రమోషన్స్ కు మాత్రం హాజరుకాదు. ఎందుకో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చైన్నై భామ నయనతార తెలుగులో లక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో తెలుగులో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోలతో నటించింది. అంతే కాదు.. సౌత్ హీరోయిన్లలో నంబర్ వన్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల కాలం నుంచి వెలుగుతోంది. వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది.

Nayantara

ఇక ఈ భామ తమిళ నటుడు శింబుతో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక వీరికి బ్రేకప్ అయినట్లు వార్తలు రాగా.. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక వీరి ప్రేమ కూడా సఫలం కాలేదు. ఇక తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడ్డ ఈ భామ.. ఎట్టకేలకు విగ్నేష్ ను పెళ్లి చేసుకుంది. ఇక వీరు ఇటీవల సరోగతి పద్దతి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.

Nayantara

ఇక వీరు కవలలకు జన్మనివ్వడం కాస్త వివాదం అయింది. కోర్టు అనుమతి లేకుండా ఎలా కంటారు అని అప్పట్లో వివాదం తలెత్తింది. ఇక ఆ వివాదం సద్దు మణిగాక వీరు బాగానే ఉన్నారు. తన సినిమా ప్రమోషన్స్ అయినా.. ఏదైనా విగ్నేష్ ఖాతా నుంచి పోస్ట్ చేసే నయన్.. ఈరోజు సడెన్ గా ఇన్ స్టాలోకి అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుంటూ స్టైలీష్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె ఎంట్రీ మూవీ ప్రమోషన్స్ కోసమని అంటున్నారు.

Nayantara Shahrukh Khan

కానీ నయనతార మూవీ ప్రమోషన్స్ లో ఎప్పుడూ పాల్గొనలేదు. ఏ స్టార్ హీరో అయినా సరే.. తను మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనదు. దానికి ఓ వాలిడ్ రీజన్ ఉంది. ఆమె సినిమా ఒప్పందంలోనే ప్రమోషన్స్ చేయను అని అగ్రిమెంట్ రాసుకుంటుందట. అందుకే చిరంజీవి సినిమా అయినా... షారుఖ్ సినిమా అయినా నయన మాత్రం ప్రమోషన్లలో కనిపించదు.

ఇక ప్రస్తుతం నయన తార షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తుండగా... రెడ్ చిల్లీస్ వారు నిర్మిస్తున్నారు. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. విపరీతంగా ఆకట్టుకుంటుంది. అనిరుద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X