Suriya Kiran No More: కల్యాణితో విడాకుల గురించి సూర్య కిరణ్ నోరు ఎందుకు విప్పలేదో తెలుసా?
ఒక్పపుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సూర్య కిరణ్ ఈరోజు మరమించారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన తాజాగా ప్రాణాలు విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో పచ్చ కామెర్లతో వ్యాధితో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈయన మృతి వార్త అందరికీ తెలియగా.. హీరోయిన్ కల్యాణీతో ఈయన ఎందుకు విడిపోయారనే వార్త కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కానీ దానికి మాత్రం సమాధానం దొరకలేదు. ఈ విడాకుల గురించి సూర్య కిరణ్ ఎక్కడా నోరు విప్పలేదు. అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య కిరణ్ పుట్టింది కేరళో. ఈయన తెలుగులో సత్యం సినిమా చేయగా.. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొదటి సినిమానే సూపర్ సక్సెస్ కావడంతో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈయన ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్ 6, నీలిమలై వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే అనేక సినిమాల్లో నటించి మెప్పించారు కూడా. ముఖ్యంగా తెలుగులోత పాటు మలయాళ, కన్నడ భాషల్లోనూ నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.

అద్భుతమైన నటనను కనబరుస్తూ... అన్ని భాషల్లో టాప్ హీరోల చిత్రాల్లో నటించారు. అయితే చిన్నప్పుడే ఈయన మాస్టర్ సురేష్ పేరుతో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఇలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సమయంలోనే... హీరోయిన్ కల్యాణీతో ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన వీళ్లు.. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొంత కాలానికే వీరిద్దరూ విడిపోయారు.
వ్యక్తిగత కారణాల విడిపోయినట్లు వీరిద్దరూ ప్రకటించినప్పటికీ అసలు కారణాలు ఏంటనేవి మాత్రం ఎవరూ చెప్పలేదు. అయితే దీనిపై ఓ ఇంటర్వ్యూలో సూర్య కిరణ్ ను అడగ్గా.. ఆయన విడాకులు గురించి ఎందుకు మాట్లాడరో చెప్పారు. కల్యాణీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండగా.. ఆమె ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వట్లేదు.. ఇస్తున్న నన్ను అంతా ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు.. నేను కూడా దీని గురించి సమాధానం చెప్పే ప్రయత్నం చేశానని అన్నారు.
పూర్తి క్లారిటీ ఇవ్వకపోయినా.. అసలు ఇంటర్వ్యూలో విడాకులకు సంబంధించిన విషయం వస్తే తాను మాట్లాడకూడదని కల్యాణీ మేనేజర్ ఫోన్ చేసి మరీ చెప్పినట్లు తెలిపారు. అందుకే కల్యాణీ గురించి కానీ ఆమెతో విడాకుల గురించి కానీ తాను మాట్లాడాలనుకోవట్లేదని వెల్లడించారు. పెళ్లి అంటే తన దృష్టిలో ఓ పంజరం లాంటిది అని.. పెళ్లైన ప్రతీ ఒక్కరూ పంజంరంలో ఉన్నట్లే తాను ఫీల్ అవుతానని కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











