Heroines: కత్తిలాంటి ఫిగర్, టాలెంట్ ఉన్నా... ఈ భామలకు నో ఆఫర్స్... ఆ ఒక్కటి లేకపోవడమే కారణమా!
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త అందాలు వస్తూంటాయి... పోతూంటాయి. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తూంటారు. హిట్టు సినిమాలు చేసినా.. స్టార్ హీరోల పక్కన నటించిన కొంత మందికి మాత్రం అవకాశాలు రావు. అంతే కాదు.. కత్తి లాంటి ఫిగర్, టాలెంట్ ఉన్నా... భామలకు కలిసి రావట్లేదు. అందం, అభినయం ఉంటే సరిపోదు.. దానికి తగ్గట్లు అదృష్టం కూడా ఉండాలని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆ వివరాల్లోకి వెళితే...
ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే.. మొదటగా గుర్తొచ్చేది శ్రీలీల. ఇక ఈమె చేతిలో వరుసగా 10 నుంచి 12 సినిమాలు ఉన్నాయి. అయితే శ్రీలీలకు ఉన్న అందం, అభినయం, టాలెంట్.. మిగతా హీరోయిన్స్ లేవా అంటే... ఉన్నాయి.. ఆమె కంటే అందంగా ఉన్న వాళ్లు ఉన్నారు. అంతకంటే బాగా నటించే వారు ఉన్నారు. కానీ శ్రీలీలకే ఎందుకు ఆ ఆఫర్స్ వస్తున్నాయి.. ఎందుకంటే.. ఆమెకు ఇప్పుడు అదృష్ట యోగం నడుస్తోంది.

అయితే ఎక్కువకాలం స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే.. అదృష్టం ఉండాలంటారు. అవును నిజమే అనిపిస్తుంది. అందం, అభినయం ఉన్నా... చాలా మంది హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయ్యారు. సక్సెస్ రేటు ఉన్నా కానీ.. వారికి ఆఫర్స్ రావడం లేదు. ఎప్పుడైతే శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందో.. పూజా హెగ్డే, రష్మిక, కృతి శెట్టి లాంటి హీరోయిన్లకు ఆఫర్స్ తగ్గాయి. వాళ్ల సినిమాలు అన్నీ ఈ భామ ఎత్తుకెళ్లిపోయింది.
రాశిఖన్నా విషయానికి వస్తే... పక్కా కమర్షియల్, థ్యాంక్యూ లాంటి డిజాస్టర్ల తర్వాత ఈ భామను పట్టించుకునే వాళ్లే లేరు. ఇక నభా నటేష్, నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే మర్చిపోయారు. ఆ తర్వాత నిధికి పవన్ హరిహార విరమల్లు సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాపైనే ఈ భామ ఆశలు పెట్టుకుంది. అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు.

ఇక నభా నాలుగు సినిమాలు చేస్తే అన్నీ ప్లాపులుగా మిగిలాయి. ఇక నివేతు పెతురాజ్, మెహ్రీన్ కూడా అందం ఉన్నా స్టార్ హీరోయిన్లు కాలేకపోయారు. ఇక అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ వరుసగా ప్లాపులు ఇచ్చేసరికి ఈ భామను పట్టించుకునే నాథుడే లేడు. అనుకు పవన్ అజ్ఞాతవాసిలో ఛాన్స్ వచ్చినా డిజాస్టర్ గా సినిమా మిగిలింది. ఇక మేఘా వరుసగా 4 ప్లాపులు వచ్చాయి.

ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే... వరుణ్ తేజ్ ను పెళ్లాడేస్తే సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టే అనుకోవాలి. రీతూవర్మకు టాలెంట్, అందం ఉన్నా కూడా అవకాశాలు రావట్లేదు. ఏదేమైనా ఈ హీరోయిన్లకు అందంతో పాటు అభినయం ఉండి కూడా హిట్లు లేక, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయిపోయారు. ఎంతైనా అందం, అభినయం, టాలెంట్ కాదబ్బా.. కూసింత అదృష్టం కూడా ఉండాలని అర్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











