మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌తో చిన్నారి ఫోజు.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో నవ్వుతూ మాట్లాడుతున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? తను తెలుగు హీరోయినే. సందీప్ కిషన్, శర్వానంద్ లాంటి టాలెంటెడ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. చాలాకాలంగా ఆమెకు పెద్దగా ఆఫర్లు లేవు. మరి ఇప్పటికీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పెట్టకపోతే అసలు విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

చిత్ర పరిశ్రమలో అందంమ్ అభినయంతో పాటు కూసింత లక్ కూడా ఉండాలి అనేది సినీ విశ్లేషకుల మాట. అదే నిజం అనేది ఇప్పటిదాకా ఎంతోమంది నటీనటుల విషయంలో నిజమైంది. ఎంత అందంగా ఉన్నా కొంతమంది హీరోయిన్లకు అదృష్టం కలిసి రాదు. చూడగానే వావ్ అనిపించే అందం, ఆకట్టుకునే అభినయం ఉన్నప్పటికీ చాలామంది హీరోయిన్లకు అవకాశాలు కరువవుతుంటాయి.

Do You Recognise Telugu Heroine with Former Indian President abdul kalam Here is the Star details

ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు చేసినప్పటికీ సూపర్ హిట్ తమ ఖాతాలో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న హీరోలందరి సరసన నటించి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఒకటి రెండు సినిమాలకే పరిమితమైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఇక పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఈ కోవకు చెందినదే అని చెప్పొచ్చు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ సురభి.

ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సురభి అందానికి ముగ్ధులవ్వని మూవీ లవర్స్ ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. పాలరాతి శిల్పం లాంటి ఫిగర్ తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఈ మిల్కీ బ్యూటీ పై స్టార్ డైరెక్టర్ల కళ్ళు మాత్రం పడటం లేదు.

2013లో ఈవెన్ వేరే మదిరి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ సురభి. అక్కడ వరుసగా సినిమాలు చేశాక టాలీవుడ్ పై కన్నేసింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడంతో కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అలా బీరువా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటిఫుల్ మూవీతోనే పర్లేదు అనిపించింది. ఆ తర్వాత శర్వానంద్ తో ఎక్స్ప్రెస్ రాజా అనే మూవీలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో సురభికి మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయి. ఎక్స్ప్రెస్ రాజా తర్వాత తెలుగులో ఈ అమ్మడు ఎటాక్, నానితో జెంటిల్మెన్, అల్లు శిరీష్ తో ఒక్క క్షణం, ఆది సాయికుమార్ తో శశి, ఓటర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే అన్ని సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపును మాత్రం తీసుకురాలేకపోయాయి. ఇక ప్రస్తుతం ఓ పెద్ద సినిమాలో అవకాశం వస్తే బాగుంటుందని కోరుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా ఉండదు. అప్పుడప్పుడు మాత్రం కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల మాజీ రాష్ట్రపతి, దివంగత నేత అబ్దుల్ కలాంతో ఉన్న ఈ ఫోటోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది సురభి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X