డాక్టర్ శ్రీలీల అన్ డ్యూటీ.. సెట్‌లో పవన్ కళ్యాణ్ బ్యూటీకి వైద్యం..
అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస హిట్ సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. తన నటన, అందం, డ్యాన్స్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న ఈ స్టార్ హీరోయిన్ కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. డాక్టర్ కూడా. ఈ మధ్యనే డాక్టర్ పట్టా అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సినిమా సెట్ లో తన తోటి స్టార్ హీరోయిన్ కి వైద్యం చేసిందట. ఆ హీరోయిన్ ఎవరు? ఇంతకీ ఏమైంది?
టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఆసక్తికర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా మెప్పిస్తున్న శ్రీలీల నిజ జీవితంలో కూడా డాక్టర్‌గా తన బాధ్యతను నెరవేర్చుతూ వార్తల్లో నిలిచింది. ఇటీవల షూటింగ్ సమయంలో అనారోగ్యానికి గురైన హీరోయిన్ రాశీ ఖన్నాకు శ్రీలీల వైద్య సలహాలు ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని రాశీ ఖన్నా స్వయంగా వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది.

సెట్స్‌లోనే ట్రీట్మెంట్
గత కొన్ని రోజులుగా రాశీ ఖన్నా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అదే సమయంలో షూటింగ్‌లో భాగంగా ఆమెకు అసౌకర్యం కలగడంతో అక్కడే ఉన్న శ్రీలీల ముందుకొచ్చి సహాయం చేసినట్లు తెలుస్తోంది. మెడిసిన్ చదివి డాక్టర్ పట్టా పొందిన శ్రీలీల తన వైద్య పరిజ్ఞానంతో రాశీకి ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైన సూచనలు ఇచ్చిందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని రాశీ ఖన్నా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. శ్రీలీలతో తీసుకున్న సెల్ఫీని పంచుకుంది. 'జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న నన్ను ఈ డాక్టర్ చాలా బాగా చూసుకున్నారు. అందరికీ ఈ డాక్టర్‌ను హైలీ రికమెండ్ చేస్తాను' అంటూ సరదా కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు కూడా శ్రీలీలను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
డాక్టర్‌గా శ్రీలీల
సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ శ్రీలీల తన వైద్య విద్యను పూర్తి చేసింది. 2024-25లో ఆమె అధికారికంగా డాక్టర్ పట్టా పొందారు. ప్రస్తుతం పూర్తిస్థాయి వైద్య ప్రాక్టీస్ చేయకపోయినా అవసరమైనప్పుడు తన పరిజ్ఞానంతో స్నేహితులు, సహనటులకు వైద్య సలహాలు ఇస్తూ ఉంటోంది ఇటు యాక్టర్ గా, అటు డాక్టర్‌గా రెండు రంగాల్లోనూ ఆమె చూపిస్తున్న నిబద్ధత అభిమానులను ఆకట్టుకుంటోంది.
'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఇద్దరు హీరోయిన్లు
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.
అభిమానుల ప్రశంసలు
రాశీ ఖన్నాకు చికిత్స అందించిన సంఘటన తర్వాత సోషల్ మీడియాలో శ్రీలీలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 'సినిమాల్లో స్టార్.. నిజ జీవితంలో డాక్టర్', మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, వెండితెరపై గ్లామర్‌తో అలరిస్తూనే నిజ జీవితంలో సేవాభావంతో ముందుకు వస్తున్న శ్రీలీల మరోసారి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రాశీ ఖన్నా చేసిన చిన్న పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











