కాజల్ డబుల్ ధమాకా..? ఈ డిసీజన్ వెనుక కారణమేంటో!
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాల జోరు ఆగటం లేదు. దశాబ్ద కాలంగా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్న ఈమె ఇటీవలే 50 సినిమాల ఫీట్ కూడా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఫ్రెష్ గా 51వ సినిమా 'సీత'ను తన మొదటి సినిమా డైరెక్టర్ తేజ తోనే చేసింది కాజల్. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితం రాబట్టలేక పోయింది.
అయినప్పటీకీ జయాపజయాలను లెక్క చేయకుండా ఎంతో ధైర్యంతో సినిమాలు చేస్తూ వస్తోంది కాజల్. ఈ మేరకు శర్వానంద్ సరసన 'రణరంగం', అలాగే జయం రవి సరసన కోమలి అనే సినిమా చేసింది కాజల్. అయితే ఈ రెండు సినిమాలను ఒకే రోజు అనగా ఆగస్టు 15 న విడుదల కాబోతున్నాయి. అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులను ఏక కాలంలో ఫ్లాప్ చేయాలని ఫిక్స్ అయినట్లుంది కాజల్. అందుకే డబుల్ ధమాకా ప్లాన్ చేసిందేమో! అనే టాక్ జనాల్లో మొదలైంది.

సాధారణంగా స్టార్ హీరో సినిమా గాని, స్టార్ హీరోయిన్ సినిమా గాని ఒక్కటి విడుదలవుతుందంటే ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది కాజల్ ఏకంగా రెండు సినిమాలతో కిక్కిచ్చేందుకు రెడీ కావడం హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఈ రెండు సినిమాలతో కాజల్ ఏ మేర వసూళ్లు రాబడుతుందనేది. మరో విషయం.. సాహో లాంటి భారీ సినిమా ఆగస్టు 15 రేస్ నుంచి తప్పుకోవడం కాజల్ ని బాగా కలిసొచ్చే అంశమేనండోయ్!.


Click it and Unblock the Notifications











