సాయి పల్లవిపై బాడీ షేమింగ్.. నన్ను తీవ్రంగా బాధిస్తుంది, నేను కూడా బాధితురాలినేనన్న గవర్నర్ తమిళిసై
సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు తన అభిమాన నటీనటులతో మాట్లాడాలి అంటే ఒక రకంగా యజ్ఞాలు చేసే వాళ్ళు వారి వారి అభిమానులు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా సోషల్ మీడియాలో ఆయన అభిమాన హీరో హీరోయిన్ల అకౌంట్ లోకి వెళ్లి నేరుగా వారి గురించి కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తమ అభిమానాన్ని చాటుకుంటే పర్వాలేదు కానీ బాడీ షేమింగ్ కు పాల్పడిన విషయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు సాయి పల్లవి విషయంలో అదే జరిగింది. సాయి పల్లవి బాడీ షేమింగ్ బారిన పడగా ఆ విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే...

శ్యామ్ సింగరాయ్ సినిమాలో
డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి తెలుగులో ఈ టీవీ ఛానల్ లో ఢీ రియాలిటీ షోలో పాల్గొన్న సాయి పల్లవి ఆ తర్వాత తన చదువు కోసం విదేశాలకు వెళ్లి డాక్టర్ అయింది. డాక్టర్ చదువుతుండగానే ఆమెకు ప్రేమ, మ్ సినిమాలో అవకాశం రావడంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఫిదా అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఎక్స్పోజింగ్ కి ఆమడ దూరం ఉండే సాయిపల్లవి చాలా జాగ్రత్తగా తను చేసే సినిమాల విషయంలో ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

దేవదాసి పాత్రలో
నాని ద్విపాత్రాభినయం చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి ఒక హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా లో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తనదైన నటన, డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఒకరకంగా సినిమా మొత్తం మీద ప్రేక్షకులను ఆసక్తి రేకెత్తించే పాత్రలలో సాయిపల్లవి నటిస్తే ఆమె పాత్ర మీద ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి.

లైవ్ డిబేట్ షో
సాయిపల్లవి నటించిన దేవదాసి పాత్రకు ఆమె సరిపోలేదు, ఆమె అందం దానికి చాలలేదు అంటూ ఆమె మీద ఒక తమిళ పత్రిక వార్త ప్రచురించింది. ఒక రకంగా ఆమె బాడీ షేమింగ్ చేస్తూ ఆ కథనం మొత్తం సాగడంతో తమిళనాట పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఒక అద్భుతమైన నటి సినిమాలో నటిస్తే దానిమీద ఇలా రకరకాల వాదనలు పుట్టించడం కరెక్ట్ కాదు అనే వాదన చాల మంది వినిపించారు. అయితే ఈ విషయం మీద ఒక టీవీ ఛానల్ లైవ్ డిబేట్ షో నిర్వహించింది. ఈ డిబేట్ కి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు.

చాలా ఈజీగా
గవర్నర్ తమిళిసై లైవ్ డిబేట్ లో మాట్లాడుతూ సాయి పల్లవి మీద బాడీ షేమింగ్ చేస్తూ చేసిన కామెంట్లు తనను తీవ్రంగా కలచివేశాయి అని పేర్కొన్నారు. అంతేకాక తను కూడా తన బాడీ కారణంగా ఎన్నో సార్లు బాడీ షేమింగ్ కు గురయ్యానని అని తమిళిసై ఓపెన్ అయ్యారు. తాను నల్లగా ఉండటం అలాగే పొట్టిగా ఉండడం వల్ల చాలా సార్లు తనను ఎగతాళి చేస్తూ మాట్లాడేవారని కానీ నేను అలాంటి వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను అని వెల్లడించారు. ఇలాంటి మాటలు చాలా బాధ పెడతాయి అని కానీ ఎగతాళి చేసే వారికి అవి ఎంత బాధ పెడతాయి అనే విషయం తెలియదు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా అనేస్తారు అని చెప్పుకొచ్చారు.

ఇలా పుట్టడం నా తప్పు కాదు
నేను కూడా చాలా బాధ పడ్డాను కానీ నా ప్రతిభ నా శ్రమ తో నేను ముందుకు వెళ్లాను అని తమిళిసై చెప్పుకొచ్చారు. ఇలా పుట్టడం నా తప్పు కాదు పొట్టిగా ఉండటం నల్లగా ఉండడం లాంటి జుట్టుతో పుట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ స్త్రీని ఒక ఆట బొమ్మలు చూస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారని తమిళిసై చెప్పుకొచ్చారు. మన సమాజంలో ఎక్కువగా స్త్రీలు బాడీ షేవింగ్ కి గురి అవుతారు అని పేర్కొన్న ఆమె పురుషులు మాత్రం అలాంటి మాటలు పెద్దగా పడాల్సిన అవసరం ఉండదని ఎందుకంటే పురుషులు 50 ఏళ్ల వరకు వారిని తమకు తాము యువకుల లగే లాగానే ఫీలవుతారని స్త్రీలను మాత్రం వారి ఎదుగుదలను చూడలేక సమాజం బాధపెడుతూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అయితే సాయి పల్లవి సాధారణంగా సినిమాలలో మేకప్ కూడా వేసుకోకుండా నటిస్తుంది. పాత్ర డిమాండ్ చేస్తే తప్ప సాధారణంగా ఆమె ఎలాంటి మేకప్ ధరించదు. శ్యామ్ సింగరాయ సినిమాలో నటించిన రోసి పాత్ర కోసం ఆమె గంటల తరబడి మేకప్ ధరించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











