‘డ్రాగన్’ హీరోయిన్ కు బంపర్ ఆఫర్... యంగ్ హీరోకు జోడీగా కొత్త క్రష్!

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ల సందడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రెండ్ కు తగ్గట్టుగా దర్శకనిర్మాతలు హీరోయిన్లకు సినిమాల ఛాన్స్ లు ఇస్తున్నారు. ఒక్క హిట్ పడితే చాలా ఆ ముద్దుగుమ్మలకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా సౌత్ ఇండస్ట్రీలో కయాదు లోహర్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఆడియెన్స్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సౌత్ లో సీనియర్ హీరోయిన్లు సైడ్ అవుతున్న తరుణంలో ఈ యంగ్ బ్యూటీ కూడా ట్రాక్ లోకి వస్తోంది.

తాజాగా ఫిబ్రవరి 21న విడుదలైన 'డ్రాగన్' చిత్రంతో కయాదు లోహర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో తన అందం, అభినయం, డ్యాన్స్ తో ఇరకొట్టేసింది. 'లవ్ టుడే'తో సెన్సేషణ్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా 'డ్రాగన్' సినిమాలో అలరించింది. తెలుగులో ఈ చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'గా విడుదలై ఆకట్టుకుంటోంది. తమిళానికి ధీటుగా తెలుగులోనూ ఈ చిత్రానికి ఇక్కడ ఆదరణ దక్కుతుండటం విశేషం. సినిమాకు ఏరేంజ్లో స్పందన దక్కుతోంది. ఇప్పుడు యంగ్ బ్యూటీ కయాదు లోహర్ కు కూడా ప్రశంసలు అందుతున్నాయి.

Dragon Movie Fame Kayadu Lohar got movie offer in Tollywood Vishwak Sen choose her for next movie

కయాదు లోహర్ నటన, అందానికి తమిళ తంబీలే కాదు... తెలుగు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ అమ్మడుకు ఇప్పుడు జై కొడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగులో రాబోయే చిత్రాల్లో కయాదు లోహర్ అవకాశాలు దక్కించుకుంటోంది. కాగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టిందనే వార్త ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ గా మారింది. యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ కు జోడీగా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఇటీవల ఈమె పేరు బాగా వినిపిస్తుండటం.. మరోవైపు కయాదు లోహర్ నటనకు ప్రశంసలు దక్కుతుండటంతో ఈ ముద్దుగుమ్మకు విశ్వక్ సేన్ రాబోయే చిత్రంలో ఛాన్స్ దక్కిందని అంటున్నారు.

విశ్వక్ సేన్ రీసెంట్ గా 'లైలా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ ఆశించిన మేర ఫలితానివ్వకపోవడంతో బాగా అప్సెట్ అయ్యారు. నెక్ట్స్ రాబోయే చిత్రాలతో తప్పకుండా అలరిస్తానని తన డియరెస్ట్ ఆడియెన్స్ కు ప్రామీస్ చేశారు. ఈ క్రమంలోనే నెక్ట్స్ 'జాతిరత్నాలు' డైరెక్టర్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఫంకీ' అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఇప్పటికే ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా కయాదు లోహర్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇది నిజమైతే అనుదీప్ .. కయాదు లోహర్ కు తెలుగులో మంచి హిట్ ఇవ్వబోతున్నారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Dragon Movie Fame Kayadu Lohar got movie offer in Tollywood Vishwak Sen choose her for next movie

ఇక కయాదు లోహార్ అస్సాంలోనే పుట్టి పెరిగింది. బీకాం కామర్స్ లో డిగ్రీ పట్టా పొట్టింది. ఆ తర్వాత సినిమాల్లో ఉన్న ఆసక్తితో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. తెలుగులో శ్రీవిష్ణు పోలీస్ అధికారికిగా నటించిన 'అల్లూరి'లో కయాదు లోహరే హీరోయిన్. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా కయాదుకు ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. కానీ రీసెంట్ గా విడుదలైన 'డ్రాగన్'తో తమిళంతో పాటు తెలుగులోనూ యమా క్రేజ్ దక్కించుకుంది. నెక్ట్స్ విశ్వక్ సేన్ తో 'ఫంకీ'తో ఎలా అలరించబోతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X