మెగా స్లీవ్స్ బ్లౌజులో దృశ్యం పాప మెస్మరైజింగ్ షో.. 22 ఏళ్లకే ఇన్ని అందాలు దాచిందా!
ఎస్తర్ అనిల్.. ఈ పేరు చెబితే చాలా మందికి ఈమె ఎవరో తెలియకపోవచ్చు. కానీ దృశ్యం సినిమాలో తరచుగా భయపడుతూ కనిపించిన చిన్న పాప అంటే అందరికీ అర్థం అవుతుంది. విక్టరీ వెంకటేష్, మీనాల చిన్న కుమార్తెగా కనిపించి మెప్పించిన ఈ క్యూట్ బ్యూటీ.. ఇప్పుడు యమా హాట్ గా తయారైంది. చూస్తుండగానే చాలా పెద్దగా అయిపోయిన ఈమె సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తోంది. తాజాగా మెగా స్లీవ్స్ స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని సోకులు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్తర్ అనిల్ 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించింది. 2013లో వచ్చిన దృశ్యం థ్రిల్లర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. ఆ తర్వాత దృశ్యం-2లో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె 2016లో ఉత్తమ బాల నటిగా కేరళ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది. వరుసగా తెలుగు, తమిళ రీమేక్ లు దృశ్యం, పాపనాసంలో చేసింది.

ఆ తర్వాత తమిళ చిత్రం కుజలిలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ చిత్రం ఇంకా విడుదలకు కాలేదు. జోహార్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో ఎక్కడ ఛాన్సు వచ్చినా ఈమె చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చాలా బిజీగా గడుపుతోంది.
తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాను షేక్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తజాగా ఈ క్యూట్ బ్యూటీ ఈ కాటన్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. అందులో మెగా స్లీవ్స్ ఉన్న బ్లౌజు వేసుకుని సోకులు ఆరబోయగా అంతా పిదా అయిపోతున్నారు. ఇంత అందంగా కనిపిస్తున్నావేంటమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె ఇంత త్వరగా పెద్దది అయిపోయిందా అనుకుంటనే.. ఆమె అందాలను తనివితీరా చూస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఎస్తర్ అనిల్ ను.. దృశ్యం సినిమాలో క్యారెక్టర్ ను పోల్చుకుంటే ఏమాత్రం గుర్తు పట్టలేం. చాలా పద్ధతిగా కనిపించిన చిన్న పాప.. అందాల బొమ్మలా తయారైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ కాటన్ చీరలో ఎస్తర్ అనిల్ ఎంత అందంగా ఉందో చూస్తేనే అర్థం అవుతుంది. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











