సాండల్ వుడ్ డ్రగ్ మాఫియా... బుజ్జిగాడు బ్యూటీ అరెస్ట్ ...
మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకున్న సాండల్ వుడ్... ఇప్పుడు తీగ లాగితే డొంక కదిలిన చందాన్న తయారైంది. ఇప్పటికే ఈ కేసును దర్యప్తు చేస్తున్న సెంట్రల్ క్రైం బ్రాంచ్, నగరంలో బడా పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తోందన్న ఆరోపణలతో నటి రాగిణీ ద్వివేదిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బుజ్జిగాడు మరదలు పిల్ల, సంజనా గల్రానీని కూడా అరెస్ట్ చేశారు.
ఇందిరానగర్ లోని సంజన ఇంటిపై దాడి చేసిన సీసీబీ అధికారులు, సోదాలు నిర్వహించి, చివరకు ఆమెను అదుపులోకి తీసుకన్నట్లు వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం, ఆమెను సీసీబీ కార్యాలయానికి తలరించినట్లు స్పష్టం చేశారు.

ఈ ఉదయమే మూడు వాహనాల్లో సంజన ఇంటికి చేరుకున్న ఇన్స్పెక్టర్ పునీత్, తన బృందంతో మూకుమ్మడిగా సంజన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు పది మంది బృందం ఇంటి అణువణువునూ జల్లెడపట్టారు. పోలీసులు సంజన మోబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె BMW కారును సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. సదరు కారు, అర్చనా గల్రానీ పేరిట రిజిస్టర్ చేసి ఉండగా, ఆమెకు, సంజనకు మధ్య బంధం గురించి తెలియలేదు.
మరోవైపు సంజన స్నేహితులు రాహుల్ ను సైతం సీసీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడికి డ్రగ్ మాఫియాతో నేరుగా సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో రాహుల్ ను అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











