హద్దులు దాటేసిన దృశ్యం పాప... బీచ్ ఒడ్డున సోకులన్నీ కట్టకట్టి అరాచకం!

సినిమాల్లో బాలనటులుగా చేసిన ఒక్కొక్కరు హీరోలుగా, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది మలయాళ ముద్దుగుమ్మ ఎస్తర్ అనిల్. అలా అంటే ఎవరికీ అర్ధం కాకపోవచ్చు కానీ దృశ్యంలో సినిమాలో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించిన పాప అంటే ఠక్కున గుర్తుపెట్టేస్తారు. పెరిగి పెద్దదైన ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎస్తర్ అనిల్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

దృశ్యంతో ఫేమ్
కేరళలోని వయనాడ్‌‌కు చెందిన ఎస్తర్ అనిల్.. 2010లో 9 ఏళ్ల వయసులో మలయాళ చిత్రం నల్లవన్‌‌లో బాలనటిగా అడుగుపెట్టింది. ఈ సినిమాలో నటనతో దర్శక నిర్మాతల కళ్లలో పడిన ఎస్తర్ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఈ దశలో దృశ్యం సినిమాతో ఎస్తర్ బ్రేక్ అందుకుంది. మలయాళంతో పాటు పలు భాషల్లో రీమేక్ అయిన ఈ చిత్రం అన్ని చోట్లా కుటుంబ ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్‌కు చిన్నకూతురిగా నటించే అవకాశం దక్కించుకుంది ఎస్తర్.

Drushyam Fame Esther Anil shared her Croatia Trip Photos with black swimsuit

బాలనటి నుంచి హీరోయిన్‌గా
బాలనటిగా చేస్తూనే చదువు పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2019లో ఊలూ అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో జోహార్ అనే సినిమాలో నటించింది. తనకు ఇంతటి పేరును తీసుకొచ్చిన దృశ్యం మూవీకి పార్ట్‌ 2ను తెరకెక్కించగా.. మరోసారి అగ్రనటులకు కుమార్తెగా నటించింది. ఈ దశలో మలయాళంలో జాక్ ఎన్ జిల్, వింధ్య విక్టిమ్ వెరిడిక్ట్ వీ 3, మిన్‌మినీ అనే తమిళ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది ఎస్తర్. వెండితెరే కాదు.. బుల్లితెరపైనా సక్సెస్ కొట్టింది. మలయాళంలో ప్రసారమైన రియాలిటీ షో టాప్ సింగర్ చిత్రానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

నటిగా గుర్తింపు కోసం పోరాటం
హీరోయిన్ కంటే నటిగా మంచి గుర్తింపు దక్కించుకునేందుకు ఎస్తర్ అనిల్ ఆరాటపడుతున్నారు. అందుకే హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నప్పటికీ.. సపోర్టింగ్ రోల్స్‌కే ఎక్కువ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత అయిన లగడపాటి శ్రీధర్ కుమారుడు సాహిదేవ్ విక్రమ్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు ఎస్తర్ అనిల్. ధమాకా చిత్రంతో హిట్ కొట్టిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వెంకట కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

క్రొయేషియా టూర్‌లో అందాల ఆరబోత
సినిమాలు, షూటింగ్‌ల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎస్తర్ అనిల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. సినిమాలు చేసినా చేయకున్నా సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తన సినిమాలు, కార్యక్రమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. అలాగే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది. అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎస్తర్ అనిల్ డోస్ పెంచేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. క్రోయేషియాలో విహరించారు. బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌ను ధరించి, టవల్‌ను నడుము వరకు చుట్టుకుని బీచ్‌ ఒడ్డున అందాలు ఆరబోసింది. దీనికి సంబంధించి కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఫలితంగా ఎస్తర్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. మరి ఇంకేందుకు ఆలస్యం దృశ్యం పాప అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: esther anil movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X