గ్లామర్ డోస్ పెంచేసిన దృశ్యం పాప... 23 ఏళ్లకే ఇన్ని అందాలు దాచిందా!

బాలనటులుగా సినిమాల్లో చేసిన వారు చూస్తుండగానే పెద్ద అయిపోతున్నారు. స్టార్స్‌కు కొడుకు, కూతుళ్లుగా నటించిన వారు ఆ స్టార్స్‌కే పోటీగా మారుతున్నారు. తేజ సజ్జా, ఆకాశ్ పూరి, కావ్య కళ్యాణ్ రామ్ వంటి వారు దూసుకెళ్తున్నారు. ఈ కోవలోకే వస్తారు దృశ్యం ఫేమ్ ఎస్తర్ అనిల్. క్రైమ్, ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ దృశ్యంలో మోహన్‌లాల్, వెంకటేశ్, కమల్ హాసన్ వంటి అగ్రనటులకు కూతురిగా నటించిన ఈ చిన్నది ఇప్పుడు వయసుకొచ్చింది. తన గ్లామర్ షోతో ఏకంగా స్టార్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టిస్తోంది.

దృశ్యంతో స్టార్‌డమ్

27 ఆగస్ట్ 2001లో కేరళలోని వయనాడ్‌లో పుట్టారు ఎస్తర్ అనిల్. 2010లో 9 ఏళ్ల వయసులో మలయాళ చిత్రం నల్లవన్‌‌లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఎస్తర్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లారు. ఈ దశలో దృశ్యం సినిమాతో ఎస్తర్ కెరీర్ టర్న్ అయ్యింది. పలు భాషల్లో డబ్ అయిన ఈ చిత్రం ప్రతి చోటా కలెక్షన్ల వర్షంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో వెంకటేష్‌కు చిన్నకూతురిగా నటించి మెప్పించింది ఎస్తర్.

Drushyam Fame Esther Anil stunning look in red color Dress Her latest photos here

బాలనటి నుంచి హీరోయిన్‌గా

దృశ్యంతో దక్షిణాదిలోని అన్ని భాషల్లో పాపులరైన ఎస్తర్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్నారు ఎస్తర్. పెరిగి పెద్దయిన తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు షాకిచ్చారు ఈ ముద్దుగుమ్మ.. 2019లో ఊలూ అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే తెలుగులో జోహార్ అనే సినిమా చేసి గుర్తింపు దక్కించుకున్నారు. దృశ్యం 2ను తెరకెక్కించగా.. మలయాళం, తెలుగులో మరోసారి అగ్రనటులకు కూతురిగా నటించి మెప్పించింది ఎస్తర్. అనంతరం మలయాళంలో జాక్ ఎన్ జిల్, వింధ్య విక్టిమ్ వెరిడిక్ట్ వీ 3, మిన్‌మినీ అనే తమిళ చిత్రాల్లో నటించారు.

తెలివిగా కెరీర్ ప్లానింగ్

అయితే చాలా తెలివిగా లీడ్ రోల్స్ కంటే కథా ప్రాధాన్యముంటే సెకండ్ లీడ్, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్‌లో అడుగులు వేస్తోంది. అయితే గతేడాది రిలీజైన మిన్‌మినీ తర్వాత మరో సినిమాకు ఎస్తర్ అనిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. సినిమాలు, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ట్రిప్‌లు, వెకేషన్‌లకు మాత్రం ఖచ్చితంగా వెళ్తోంది ఈ చిన్నది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, లేదా ఒంటరిగానే విహారయాత్రలకు వెళుతోంది.

సోషల్ మీడియాలో గ్లామర్ షో

సినిమాలు, షూటింగ్‌ల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎస్తర్ అనిల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది. అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎస్తర్ అనిల్ ఓ రేంజ్‌లో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ గౌను ధరించి ఓ పూల తోటలో ఫోటో షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. ఫలితంగా ఎస్తర్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. మరి ఇంకేందుకు ఆలస్యం దృశ్యం పాప అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: esther anil movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X