దృశ్యం పాప బికినీ షో.. బీచ్‌లో అందాల సునామీ సృష్టిస్తూ!
చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వారిలో కొందరు మాత్రమే చిన్న వయసులోనే నేషనల్ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో ఎస్తర్ అనిల్ ఒకరు. దృశ్యం అనే సినిమాతో ఎన్నో భాషల్లో పరిచయం అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత చాలా భాషల్లో అవకాశాలను అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే స్పీడుతో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇక, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఎస్తర్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
టీనేజ్‌లోనే సెన్సేషన్‌గా
టీనేజ్‌లో ఉన్నప్పుడే ఎస్తర్ అనిల్ 'నల్లవన్' అనే మలయాళ సినిమాతో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. అయితే, ఈ చిత్రం మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ, ఆ తర్వాత ఈ చిన్నది Oru Naal Varum అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంతో ఎస్తర్ అనిల్ మంచి గుర్తింపు అందుకుంది. దీంతో ఆమె ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడి ఫుల్ ఫేమస్ అయింది.

దృశ్యంతో ఫుల్ హైలైట్
కెరీర్ ఆరంభంలోనే ఎస్తర్ అనిల్ Sakudumbam Shyamala, Cocktail, Doctor Love సహా ఎన్నో సినిమాలో మంచి మంచి రోల్స్‌లో నటించింది. ఆ సమయంలోనే 'దృశ్యం' అనే సినిమాతో విశేషమైన గుర్తింపును అందుకుంది. ఇదే చిత్రం తెలుగులోకి కూడా రీమేక్ అయింది. ఇందులోనూ ఎస్తర్ అనిల్ నటించింది. ఇలా దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది.
టాలీవుడ్‌లోకి ఎంటర్
'దృశ్యం' మూవీ తర్వాత ఎస్తర్ అనిల్‌కు అన్ని భాషల్లోనూ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఈమె విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత ఈ అమ్మడు 'జోహార్' అనే తెలుగు సినిమాలో లీడ్ రోల్ కూడా చేసింది. కానీ, ఆ తర్వాత ఎందుకనో ఆమె మరో సినిమాను ఒప్పుకోలేదు. కానీ, మరోసారి 'దృశ్యం 2' మూవీతో ఎస్తర్ అనిల్ మరింతగా అలరించింది.

ఇప్పుడు అలాంటివేగా
మలయాళంలో ఎస్తర్ అనిల్ ఈ మధ్య కాలంలోనే చాలా సినిమాల్లో నటిస్తోంది. ఎక్కువ శాతం లీడ్ రోల్స్ కంటే సపోర్టింగ్ పాత్రలకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇలా 2022లో 'జాక్ అండ్ జిల్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అంటే 2023 'Vindhya Victim Verdict V3' అనే తమిళ చిత్రంలో మెరిసింది. కానీ, తర్వాత మరో మూవీని ఎస్తర్ లైన్‌లో పెట్టలేదు.
అక్కడ మాత్రం బిజీగా
సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా ఎస్తర్ అనిల్ మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన అందమైన ఫొటోలు, వీడియోలను వదులుతూ తన క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

ఎస్తర్ పిక్స్ వైరల్‌గానే
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎస్తర్ అనిల్ ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది తాజాగా బీచ్‌లో బికీనీ ధరించి తీసుకున్న బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తోంది. ఫలితంగా ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











