దుబాయ్ టి10 క్రికెట్ లీగ్: బాలీవుడ్ హీరోయిన్ డాన్స్ షో, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
దుబాయ్ కేంద్రంగా మరికొన్ని రోజుల్లో టి 10 క్రికెట్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేల డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోందట. అయితే ఇందుకోసం ఊర్వశి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.
ఈ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఊశ్వరి బాలీవుడ్ సాంగ్స్ సారా జమానా, రేష్మా కా రుమాల్, డాడీ మమ్మీ, నామ్ హై మేరా మేరా మేరాతో పాటు.... అరబిక్ బీట్‌కు డాన్స్ చేయబోతోందని సమాచారం.

ఈ పెర్ఫార్మెన్స్‌కు గానూ.... ఊర్వశీ రౌటేల రూ. 80 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. కేవలం కొన్ని నిమిషాల పాటు జరిగే డాన్స్ షో కోసం ఇంత భారీ మొత్తం రెమ్యూనరేషన్ ఆర్జిస్తుండటం చర్చనీయాంశం అయింది.
దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్ వేదికగా ఈ ప్రారంబోత్సవ వేడుక వద్ద జరుగనుందట. ముందుగా ఆతిఫ్ అస్లామ్, మహిరా ఖాన్ ప్రదర్శన తర్వాత ఊర్వశీ రౌటేల డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ షో చూసేందుకు కేటాయించిన టిక్కెట్స్ ధరలు కూడా భారీగానే ఉన్నాయట.


Click it and Unblock the Notifications











