వరుణ్ తేజ్‌కు హీరోయిన్‌గా డబ్‌స్మాష్ బ్యూటీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రయోగాల బాటపట్టారు. అంతరిక్షం చిత్రంలో వ్యోమగామిగా నటించిన వరుణ్ తేజ్ ఆ తర్వాత ఎఫ్2 లో వెంకటేష్ తో కలసి నటించాడు. కొన్ని రోజుల క్రితమే వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభమైంది. హరీష్ శంకర్ దర్శత్వంలో వాల్మీకి చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ తో నటించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. వాల్మీకిలో వరుణ్ తేజ్ కు జోడిగా తమిళ డబ్‌స్మాష్ బ్యూటీ మృణాళిని రవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మృణాళిని తమిళ వీడియోలతో డబ్‌స్మాష్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

వాల్మీకి చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే చిత్రాలతో హరీష్ కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన ఈ కథతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











