24 ఏళ్లకే గుండె పోటుతో దుల్కర్ సల్మాన్ హీరోయిన్ మృతి.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల సీనియర్ నటులు కన్నుముస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు చంద్ర మోహన్, హిందీలో సీఐడీ నటుడు.. ఇలా మృతి చెందారు. అయితే ఇప్పుడు తాజాగా యువ నటి కన్నుమూసింది. అది కూడా 24 ఏళ్లకే గుండె పోటుతో చనిపోవడం.. ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఇంత చిన్న వయసులో చనిపోడవం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఆమె ఎవరు.. ఎలా చనిపోయింది.. కారణాలు ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యువ హీరోయిన్ కన్నుమూసింది. అది కూడా గుండె పోటుతో 24 ఏళ్లకే చనిపోయింది. వయసులో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా తర్వాత ఈ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆరు ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకు గుండె పోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది.

దుల్కర్ సల్మాన్ సరసన నటించి.. క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటి లక్ష్మీకా సజీవన్.. గుండె పోటుతో చనిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం యూఏఈలో ఉండగా.. 24 ఏళ్లకే ఈ బ్యూటీ చనిపోవడం.. ఆమె అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
లక్ష్మీకా సజీవన్ పలు సినిమాల్లో నటించింది. అంతే కాదు బుల్లితెరపై కూడా నటించి మెప్పించింది. లక్ష్మిక సజీవన్ తన కెరీర్‌లో 'ఒరు యమందన్ ప్రేమకథ,' 'పంచవర్ణతాతా,' 'సౌదీ వెల్లక్క,' 'పూజయమ్మ,' 'ఉయరే,' 'ఒరు కుట్టనాదన్ బ్లాగ్,' 'నిత్యహరిత నాయగన్' వంటి అనేక చిత్రాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ ప్రేమకథా చిత్రాల్లో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

కొచ్చిలోని పల్లురుత్తిలోని కచేరిపాడి వజ్వేలిల్‌కు చెందిన సజీవన్, లిమిత దంపతుల కుమార్తె లక్ష్మిక. ఈ భామ సినిమాలపై ఇంట్రెస్ట్ తో సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ అయిపోయింది. ఇక ప్రస్తుతం షార్జాలో బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తుంది. ఈమె మరణం తెలుసుకున్న ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక కరోనా తర్వాత గుండె పోటు మరణాలు ఎక్కువ అయ్యాని తెలుస్తోంది.
ఇక ఆ మధ్య కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా ఒక్కసారిగా కూప్పకూలారు. ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇలా గుండె పోటుతో స్టార్ హీరోలు, హీరోయిన్స్ మరణించడం ఫ్యాన్స్ కు షాక్ ను కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











