జాన్వీ కపూర్, దుల్కర్ సల్మాన్ జంటగా.. ఏ చిత్రం కోసమో తెలుసా!
ఇటీవల శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తొలి మహిళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ చిత్రం విషయంలో మరో ముందడుగు పడింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కు జోడిగా మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు తాజా సమాచారం.
1999 కార్గిల్ వార్ లో గాయపడిన సైనికుల్ని గుంజన్ సక్సేనా తన విమానంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆమె అద్భుత ప్రయత్నానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. గుంజన్ పాత్రలో నటించేందుకు జాన్వీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో దుల్కర్ సల్మాన్ మూడవసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది దఢక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం జాన్వీ పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న థక్త్ చిత్రంలో జాన్వీ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











