Jacqueline Fernandez : 7 కోట్ల ఆస్తులు సీజ్.. బాలీవుడ్ భామకు ఈడీ షాక్

బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ అనూహ్యంగా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన తమిళనాడుకు చెందిన సుఖేష్ చంద్ర శేఖర్ అనే వ్యక్తితో సంబంధం కలిగి ఉన్న కారణంగా ఆమెను ఇప్పటికే పలుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఇక తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెకు సంబంధించిన ఆస్తులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

బాలీవుడ్ లో ఎంట్రీ

బాలీవుడ్ లో ఎంట్రీ


శ్రీలంక లోనే పుట్టి పెరిగిన జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటన మీద ఆసక్తితో భారత్ కు మకాం మార్చి హిందీ సినిమాల్లో సత్తా చాటింది. ఆస్ట్రేలియాలో చదువుకున్న ఆమె తర్వాత శ్రీలంక లో ఒక టీవీ రిపోర్టర్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా మోడలింగ్ మొదలుపెట్టింది. అలా ఆమె మిస్ యూనివర్స్ శ్రీలంక 2006 అవార్డు అందుకుంది అలాగే శ్రీలంక దేశం నుంచి అదే ఏడాది మిస్ యూనివర్స్ గా కూడా పోటీ పడింది.. సరిగ్గా మూడేళ్ల తర్వాత అలాద్దీన్ అనే సినిమా ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేసింది.

స్పెషల్ సాంగ్ లో

స్పెషల్ సాంగ్ లో


ఆ తర్వాత ఆమె హిందీలో నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. హిందీలో హౌస్ ఫుల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఆమె మర్డర్ 2 సినిమాలో అవకాశం దక్కించుకుంది. హౌస్ ఫుల్ 2 సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. తర్వాత రెండు సినిమాల్లో ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో రామయ్య వస్తావయ్య సినిమాలో ఒక హాట్ సాంగ్ కి మెరిసిన ఆమె తెలుగువారికి కూడా పరిచయమైంది.

బాలీవుడ్ కి పరిమితమై

బాలీవుడ్ కి పరిమితమై


ఇక ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి పరిమితమైన ఈ భామ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. అయితే సాహో సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను తన ఐటమ్ సాంగ్ తప్ పలుకరించింది.. అయితే తాజాగా సుఖేష్ చంద్ర శేఖర్ కు చెందిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెకు షాకిచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సంబంధించిన 7 కోట్ల 27 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు..

ఆరుగురిని ఛార్జిషీట్లో

ఆరుగురిని ఛార్జిషీట్లో


ఇక ఈ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అతని భార్య నటి లీనా మరియా పాల్ తో పాటు మరో ఆరుగురిని ఛార్జిషీట్లో చేర్చారు.. ఇక సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు అనేక విలువైన బహుమతులు ఇచ్చాడని తేలడంతో అనేకసార్లు ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దీనికి తగ్గట్టుగానే సుఖేష్ చంద్ర శేఖర్ తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క్లోజ్గా మూవ్ అవుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియా లో విడుదల కావడంతో ఆమెకు తల నొప్పులు మొదలయ్యాయి..

పలుకుబడి ఉన్న వ్యక్తిగా

పలుకుబడి ఉన్న వ్యక్తిగా


ఈ విషయంలో సంయమనం పాటించాలని కూడా ఆమె గతంలో మీడియాను విజ్ఞప్తి చేసింది. తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కొన్ని జిమ్మిక్కులు ప్లే చేసి తమిళనాడులో ఉన్న ఒక పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి గా పరిచయం చేసుకుని జాక్వెలిన్ కు దగ్గరయ్యాడు.. ఆమె సుఖేష్ చంద్రశేఖర్ ను నమ్మడం ప్రారంభించిన మొదట్లో ఖరీదైన పూలు, చాక్లెట్లు అలాగే కొన్ని పెంపుడు జంతువులను కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X