జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిపై ఛార్జిషీట్.. వందల కోట్ల కుంభకోణంలో ఈడీ కొరడా

దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్‌ విచారణ ఈడీ వేగవంతం చేసింది. సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలు ఉన్న సినీ తారలపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వలైన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహిపై కేసు తోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన అధికారులు వారిద్దరి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరికి సుకేష్ చంద్రశేఖర్ భారీగా, విలువైన బహుమతులు ఇచ్చారనే విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించడంతో ఈ కేసు ఉచ్చు జాక్వలైన్, నోరా ఫతేహికి చుట్టుకొన్నది. అక్టోబర్‌లో జాక్వలైన్‌, నోరా ఫతేహిని విచారించిన సంగతి తెలిసిందే.

National investigation organisation ED files charge sheet on Nora Fatehi and Jacqueline Fernandez on Sukesh Chandrashekhar case.

ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం.. దర్యాప్తులో భాగంగా చంద్రశేఖర్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. నోరా ఫతేహికి విలాసవంతమైన కారును బహుకరించాడు. అలాగే జాక్వలైన్‌కు కూడా కోట్లాది రూపాయల విలువైన గిఫ్టులను ఇచ్చారు. జాక్వలైన్‌తో సంబంధాలు ఉన్నాయనే విషయానికి వారిద్దరి ముద్దులు పెట్టుకొంటూ దిగిన ఫోటోనే సాక్ష్యం అని అధికారులు చెప్పారు.

ఇదిలా ఉండగా, తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ జైలులో అధికారులకు భారీగా లంచం ఇచ్చి బెయిల్ తీసుకొన్నారు. కోట్లాది రూపాయలు ఇచ్చి జైలులో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. జైలు నుంచే 200 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు వచ్చాయి.

సుకేష్ చంద్రశేఖర్‌ విషయానికి వస్తే.. రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్‌‌ నుంచి 200 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. వారిని బెదిరించి భారీగా డబ్బు రాబట్టుకొన్నాడనే అభియోగాలపై కేసు నమోదైంది. ఆ సమయంలో చెన్నై సముద్ర తీరంలో ఉన్న ఆయన నివాసంపై మెరుపు దాడులు నిర్వహించి రూ.85 లక్షల నగదు, భారీగా విలాసవంతమైన వస్తువులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిలో డజనుకుపైగా లగ్జరీ కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X