twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nora Fatehi: రూ. 200 కోట్ల చీటింగ్‌ కేసులో ఈడీ విచారణ.. మరోసారి జాక్వెలిన్ కూడా..

    |

    మనీలాండరింగ్‌ కేసులో ప్రముఖ బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోర్టిస్ట్‌ హెల్త్‌ కేర్‌ ప్రమోటర్‌ శివిందర్‌ సింగ్‌ కుటుంబాన్ని రూ. 200 కోట్ల మేర మోసం చేసినందుకు అరెస్ట్ అయిన సుఖేష్‌ చంద్ర శేఖర్‌, ఆయన భార్య లీనా పాల్‌ కేసులో నోరా ఫతేహి ప్రమేయంపై ఇడి అధికారులు విచారిస్తున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

     వారి పేర్లు బయటకు రావడంతో

    వారి పేర్లు బయటకు రావడంతో


    2017 లో ఎలక్షన్ కమిషన్ కు లంచం ఇచ్చిన కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్ ని విచారించగా పలువురు పేర్లు బయటకు వచ్చాయి. చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడిపినట్లు ఆరోపణలున్నాయి. చంద్రశేఖర్ వెల్లడించిన పేర్లలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహిలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఈడీ వారికి సమన్లు జారీ చేసింది.

    జైల్లో ఉండే అంతా

    జైల్లో ఉండే అంతా

    అండర్‌ ట్రయల్ ఖైదీగా ఢిల్లీలోని రోహిణి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఒక వ్యాపారవేత్త నుంచి ఏడాదికి 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతనిపై 20కి పైగా ఇతర దోపిడీ కేసులు కూడా నమోదయ్యాయి. ఇతరుల్లాగే ఈ కేసులో నోరా ఫతేహీని ఇరికించడానికి సుకేశ్ కుట్ర చేశాడని చెబుతున్నారు. ఈ కేసులో సమన్లు అందుకున్న బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

     ఈడీ కార్యాలయంలో

    ఈడీ కార్యాలయంలో

    మనీలాండరింగ్ కేసులో ఈరోజు అక్టోబర్ 14 న అంటే ఈ రోజున ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని నోరాను కోరారు. ఇదే కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని గతంలో విచారించిన ఈడీ మరో సారి తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఇక సమన్లు అందుకున్న నోరా సమయానికి ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.

     మరోసారి జాక్వెలిన్

    మరోసారి జాక్వెలిన్


    అక్కడ సుకేష్ చంద్ర శేఖర్ ద్వారా రూ .200 కోట్ల మోసం కేసులో అధికారులు ఆమెను విచారించబోతున్నారు. మీడియా నివేదికల ప్రకారం అక్టోబర్ 15 న విచారణ కోసం జాక్వెలిన్‌ను ED కార్యాలయానికి పిలిచారు. ఈ కేసులో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రమేయం ఉన్న చాలా మంది వ్యక్తులపై ఈడీ ద్రుష్టి పెట్టింది. ఈ క్రమంలోనే జాక్వెలిన్ శుక్రవారం ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది.

    బాలీవుడ్ వాళ్ళు కూడా?

    బాలీవుడ్ వాళ్ళు కూడా?

    ఎన్నికల కమిషన్ లంచం కేసులో నిందితుడైన సుకేశ్ చంద్ర శేఖర్ మోసం చేసిన డబ్బులు విదేశాల్లో పెట్టుబడి పెట్టారా అనే అంశాలపై ED ఆరా తీస్తున్నట్లు నివేదికలలో వెల్లడి అవుతోంది. ఎలక్షన్ కమిషన్ లంచం కేసుతో సహా 21 కేసులలో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలు క్రియాశీలంగా ఉన్నారని ఈడీ భావిస్తోంది. అంతకుముందు, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జాక్వెలిన్ స్టేట్మెంట్ కూడా నమోదు చేయబడింది.

    Recommended Video

    Harvey Weinstein Went Behind The Bars
    భారీగా స్వాధీనం

    భారీగా స్వాధీనం


    ఈ కేసుకు సంబంధించి చెన్నైలోని సముద్ర తీరంలో ఉన్న ఒక విలాసవంతమైన బంగ్లా స్వాధీనం చేసుకున్నామని, దానితో పాటుగా రూ .82.5 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 16 లగ్జరీ కార్లు మరియు అనేక ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలియజేసింది. ఇతరుల్లాగే నోరా ఫతేహీని ఇరికించడానికి సుకేశ్ కుట్ర చేశాడని చెప్పబడుతోంది. జాక్వలెన్‌, నోరా ఫతేహి కూడా చంద్ర శేఖర్‌ చేతిలో మోసపోయినట్లు పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మరి చూడాలి వీరి విచారణ తరువాత ఏం తేలనుంది అనేది.

    English summary
    ED Summons Nora Fatehi and Jacqueline Fernandez in sukesh chandrasekhar Money Laundering Case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X