twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా.. హృదయాలను గెలుచుకొన్న ఇషాచావ్లా

    |

    ఈ రోజు అతిలోక సుందరి శ్రీదేవి జన్మదినోత్సవం సందర్భంగా దేశమంతా ఆమె అభిమానులు ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నారు. ఇక మరికొందరు సినీ తారలు ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్ ఇషా చావ్లా వినూత్నంగా శ్రీదేవిపై తనకున్న అభిమానునాన్ని ఒక మంచి కార్యక్రమం ద్వారా చూపించారు.

    మిషన్ గ్రీన్, ముంబై ద్వారా 101 పండ్లమొక్కలను పేద రైతు కుటుంబాలకు అందజేసే కార్యక్రమంలో ఇషా పాల్గొంది. శ్రీదేవి గారిని ఇన్సిప్రేషన్ గా తీసుకుని ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో వివిధ రకాల పాత్రలు చేసానని చెబుతూ.. శ్రీదేవి అంటే మన జీవితంలో ఓ భాగంలా మిగిలిపోయారు. అలాంటి శ్రీదేవి గారి గుర్తుగా మంచి ఆరోగ్యాన్ని అందించే పండ్ల చెట్లను రైతు కుటుంబాలకు అందించనున్నట్లు ఇషా వివరణ ఇచ్చింది.

    Eesha chawla a solid tribute to Sridevi Jayanthi,

    చెట్లు కూడా మన జీవితంలో ఓ భాగమే అంటూ.. ఈ పండ్ల చెట్లు వాతావరణంలో పొల్యూషన్ ను కంట్రోల్ చేస్తాయని అన్నారు. అలాగే రైతు కుటుంబాలకు ఆదాయం కూడా వస్తుందని వారంతా ఈ చిన్న సహాయంతో ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ఇక గ్రీనరీ పెరుగుతుందని తెలిపిన ఇషా రైతులకు మంచి జరుగుతుందని పొల్యూషన్ లేని పండ్లు కూడా అందుతాయని మాట్లాడారు.

    ఈ చాందినిని గుర్తు చేసుకుంటూ, ఆ వెన్నెల రాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా మిషన్ గ్రీన్ , ముంబై సంస్థ ద్వారా ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నామని అన్నారు. ఇక ఫైనల్ గా ఆమెకు ఇచ్చే ఘన నివాళి ఇదేనని వివరణ ఇచ్చిన ఈషా అందరికి ధన్యవాదాలు తెలిపారు.

    English summary
    As well as fruit-bearing trees that provide good health are also a part of our lives! These fruit trees control pollution in the environment. Income comes to some farmer families. My feeling is that the respective families will be happy. Greenery grows. Good luck to the farmers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X