బాత్‌టబ్ ఫొటోలతో సెగలు రేపుతోన్న ఈషా రెబ్బా: తెలుగమ్మాయి హాట్ హాట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా

పేరుకు తెలుగు సినీ ఇండస్ట్రీనే అయినా.. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎక్కువగా ఉత్తరాది హీరోయిన్లకే మనవాళ్లంతా ప్రాధాన్యత ఇస్తున్న కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కొంత కాలంగా టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతోంది లోకల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్‌తో వరుస ఆఫర్లు అందుకుంటోన్న ఈమె.. తాజాగా బాత్‌టబ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

కుర్ర హీరోయిన్ అందాల ఆరబోత... కురచ దుస్తుల్లో హంగామా

అలా పరిచయం అయిన ఈషా రెబ్బా

అలా పరిచయం అయిన ఈషా రెబ్బా

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమా ద్వారా నటిగా చిత్ర సీమకు పరిచయం అయింది ఈషా రెబ్బా. అనంతరం 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంది.

ఈషా ఆ రెండు సినిమాలే పర్వాలేదు

ఈషా ఆ రెండు సినిమాలే పర్వాలేదు

సుదీర్ఘ ప్రయాణంలో ఈషా రెబ్బా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ మొత్తంలో 'అంతకు ముందు ఆ తర్వాత', 'అమీతుమీ' ప్రేక్షకుల మన్ననలు పొందాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా అన్నింటిలోనూ నటన పరంగా మాత్రం ఆమె ఆకట్టుకుందనే చెప్పాలి.

తమన్నా భాటియ లేటేస్ట్ ఫోటో షూట్.. మరింత గ్లామర్‌తో మిల్కీబ్యూటీ

టాలెంట్‌ ఉన్నా సరైన అవకాశాల్లేవు

టాలెంట్‌ ఉన్నా సరైన అవకాశాల్లేవు

కొన్ని సినిమాల్లో అసాధారణ నటనతో ఆకట్టుకున్నప్పటికీ.. ఈషా రెబ్బా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా మంచి మంచి ఆఫర్లు దొరకడం లేదు ఈ హాట్ బ్యూటీకి. గ్లామర్ రోల్స్ కోసం ఆమెను సంప్రదిస్తున్నా.. వాటిని చాలా వరకూ తిరస్కరిస్తోంది. అదే సమయంలో పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంచుకుంటానని చెబుతోంది.

ఎన్టీఆర్ సినిమాలో.. ఇప్పుడిందులో

ఎన్టీఆర్ సినిమాలో.. ఇప్పుడిందులో

త్రివిక్రమ్ శ్రీనివాస్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ'లో ఈషా రెబ్బా నటించింది. అయితే, ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక, ఇప్పుడు అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లోనూ కీలక పాత్ర పోషించింది. ఈ పాత్ర పరిధి ఎంత ఉందో తెలియదు కానీ.. దీనిపై ఆమె ఆశలు పెట్టుకుంది.

రణ్‌వీర్ సింగ్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ.. అమ్మాయిల మతి పోగొట్టేలా...

‘పిట్ట కథలు' వల్ల ఈషాకు ప్రశంసలు

‘పిట్ట కథలు' వల్ల ఈషాకు ప్రశంసలు

ప్రముఖ ఓటీటీ సంస్థ ఇటీవల 'పిట్ట కథలు' పేరుతో ఓ సిరీస్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన 'పింకీ'లో ఈషా రెబ్బా నటించింది. రెండు జంటలైన సత్యదేవ్‌ - ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌ - ఆషిమా నర్వాల్‌ మధ్య మారిన అనుబంధాన్ని తెలిపే కథతో రూపొందిన ఇది నిరాశ పరిచింది. కానీ, ఈషాకు మంచి పేరు తెచ్చింది.

బాత్‌టబ్ ఫొటోలతో సెగలు రేపుతోంది

బాత్‌టబ్ ఫొటోలతో సెగలు రేపుతోంది

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. ఈ కారణంగానే తరచూ ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

హాట్ హాట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా

హాట్ హాట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా

ఇంటర్నెట్‌లో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు వదులుతూ సెగలు రేపుతోంది ఈషా రెబ్బా. ఇందులో భాగంగానే తాజాగా బాత్‌టబ్‌లో దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో అమ్మడు ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అందుకే ఈ పిక్‌లకు దాదాపు లక్షకు పైగానే లైకులు వచ్చాయి. దీంతో ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X