లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా.. బాలీవుడ్‌లో భలే అవకాశం
తెలుగు తెరపై ఇతర భాషా నటీమణులు రాణిస్తుండగా.. తమకేం తక్కువ అన్నట్లుగా బాలీవుడ్ తెరపై రాణించేందుకు రెడీ అయింది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. దక్షిణాది సినిమాల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తుండటంతో ఇక్కడి హీరో హీరోయిన్స్‌పై కన్నేస్తున్నారు ఉత్తరాది ఫిలిం మేకర్స్. ఈ మేరకు దక్షిణాది తారలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రోజు రోజుకూ ఉత్తరాది ఫిలిమ్ మేకర్స్ ఆలోచనా తీరు మారుతూ వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో టాలెంటెడ్ యాక్టర్స్ ఉండటం, ఇక్కడ ఫ్యాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా రూపొందుతుండటం కారణంగా వారి దృష్టి ఇక్కడి తారలపై పడుతోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఫిలిమ్ మేకర్స్ దక్షిణాది నటీనటులకు ఎక్కువ మొత్తం పారితోషికం ఆఫర్ చేసిమరీ బాలీవుడ్‌లోకి లాగేస్తున్నారు.

తాజాగా హీరోయిన్ ఈషారెబ్బా బాలీవుడ్‌లో నటించే లక్కీ ఛాన్స్ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ, ఆమెకు తెలుగు తెరపై సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఇక బాలీవుడ్ సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోందట ఈషా.
సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో ఈషారెబ్బా హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది. జాతీయ అవార్డ్ గ్రహీత రాజ్‌సింగ్ చౌదరి ఈ సినిమా రూపొందిస్తున్నారు. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో రాజస్థానీ అమ్మాయిగా ఈషారెబ్బా నటించనుందట.


Click it and Unblock the Notifications











