For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తేనే గుర్తిస్తున్నారు.. అయినా మీకెందుకు బాధ.. ఈషా రెబ్బా బోల్డ్ కామెంట్స్

    |

    టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల హవా కాస్త తక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి బయటకు వెళ్లి వేరే ఇండస్ట్రలో సత్తా చాటే నటీమణులు కూడా ఉన్నారు. అయితే మన తెలుగు అమ్మాయిలు ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఉత్తరాది భామలు ఇక్కడి వచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకుని బాలీవుడ్‌కు చెక్కేస్తుంటారు. అయినా సరే అలాంటి వారికే పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటారు దర్శకనిర్మాతలు. ఇక్కడి లోకల్ హీరోయిన్లను మాత్రం అంతగా గుర్తించుకోరు.

    వేళ్ల మీదే లెక్కపెట్టేట్టు..

    వేళ్ల మీదే లెక్కపెట్టేట్టు..

    తెలుగు తెరపై వెలిగిన తెలుగమ్మాయిల పేర్లను వేళ్ల మీదే లెక్కపెట్టోచ్చు. నేటి తరంలో అయితే అది కూడా అసాధ్యమే. ఒకప్పుడు తెలుగు హీరోయిన్‌గా లయ మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా.. పాత్రకు తగ్గట్టు నటిస్తూ మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకుంది. అయితే పెళ్లి చేసుకుని అమెరికాలో సెట్ అవడంతో సినీ పరిశ్రమకు దూరమైంది.

    ఇక్కడి వారు పక్క ఇండస్ట్రీలో..

    ఇక్కడి వారు పక్క ఇండస్ట్రీలో..

    మన తెలుగమ్మాయిలను ఇక్కడ తక్కువ చూపు చూసినా.. తమ ప్రతిభను నమ్ముకుని పక్క ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇందుకు చక్కటి ఉదాహరణ అంజలి. తమిళ పరిశ్రమలో తనను తాను నిరూపించుకుని.. తెలుగు నాట క్రేజ్ సంపాదించుకుంది. ఇక్కడి చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

    తెలుగమ్మాయి అనే బ్రాండ్‌తో ఈషా..

    తెలుగమ్మాయి అనే బ్రాండ్‌తో ఈషా..

    తెలుగమ్మాయి అనే బ్రాండ్‌తో ఈషా రెబ్బా బాగానే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. అ!, అరవింద సమేత, బ్రాండ్ బాబు లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న తెలుగు హీరోయిన్స్‌లో ఈషానే ముందుంటుంది. అయితే ఇప్పటి వరకు గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తూ.. కేవలం నటనతోనే నెట్టుకొస్తూ ఉంది.

    సోషల్ మీడియాలో రెచ్చిపోతూ..

    సోషల్ మీడియాలో రెచ్చిపోతూ..

    అయితే సినిమాల వరకు అచ్చ తెలుగమ్మాయిల కనిపిస్తూ.. అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ వస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చగొడుతూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్‌లతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా వీటిపై ప్రశ్నలను సంధించగా ఆమె చెప్పిన సమాధానం అందర్నీ షాక్‌కు గురి చేసింది.

    మీకేందుకు బాధ..

    మీకేందుకు బాధ..

    సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న హాట్ ఫోటోల గురించి ప్రశ్నించగా.. అలాంటి హాట్ ఫోటోలు పెట్టిన తర్వాతే తనను గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయినా తన గ్లామర్‌ను షోకేస్ చేసుకోవడానికి తానెప్పుడూ ఇబ్బందిపడలేదని, అలాంటిది మీకేందుకు ఆ బాధ అని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఈషా ప్రస్తుతం రాగల 24 గంటల్లో అనే చిత్రంతో పలకరించేందుకు సిద్దంగా ఉంది.

    English summary
    Eesha Rebba Open Up On Her Hot Photo Shoot. She Has No Regrets For It. She Is Ready Do Show Case Her beauty On Screen. She Is Coming With Ragala 24 Gantallo On 22nd November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X