చీరలో హద్దులు దాటేసిన తెలుగు బ్యూటీ.. ఆ ప్లేస్‌ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అడపా దడపా మెరుపులు తప్పించి క్రేజీ ఆఫర్స్ అందుకున్న వారు తక్కువే. బేబీతో అలరించిన వైష్ణవి చైతన్య .. జాక్ చిత్రంతో ఫ్లాప్ అందుకోవడం ఆమె జోరుకు బ్రేక్ వేసినట్లయ్యింది. అనన్య నాగళ్ల, రీతూ వర్మ వంటి వారు ఎప్పుడో ఒకసారి హిట్ కొడుతున్నారు. అయితే వీరి కంటే ముందే ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు ఈషా రెబ్బా.

2013లో సినీ పరిశ్రమలో ఎంట్రీ

2013లో సుమంత్ అశ్విన్ సరసన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు ఈషా రెబ్బా. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూకట్టాయి. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, బందిపోటు, ఓయ్, అమీతుమీ, మాయామాల్, దర్శకుడు, అవే, బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో ఈషా నటించారు. ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాతో తన కెరీర్ మారిపోతుందని అనుకున్న ఈ ముద్దుగుమ్మకు కలలన్నీ కల్లలయ్యాయి. ఎన్టీఆర్ పక్కన ఓ పాటలో తప్పించి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని ఈషా వాపోయారు.

Eesha Rebba evolution in blue saree now she has a symbol of timeless elegance

ఈషాను పట్టించుకుని మేకర్స్

ఈ సినిమా తర్వాత సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మామ మశ్చీంద్ర వంటి సినిమాలలో ఈషా రెబ్బా నటించారు. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలలో అదృష్టం పరీక్షించుకున్నా నిరాశే ఎదురైంది. దీంతో తాడోపేడో తెలుగులోనే తేల్చుకోవాలని కష్టపడుతున్నారు ఈషా రెబ్బా. 3 రోజెస్, పిట్టకథలు, మాయబజార్ ఫర్ సేల్, దయా వంటి క్రేజీ వెబ్‌ సిరీస్‌లలోనూ ఈషా రెబ్బా నటించింది. తన టాలెంట్ నిరూపించుకున్నప్పటికీ ఎందుకో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు.

ఈషా పెళ్లిపై రూమర్స్

35 క్రాస్ చేసినా నేటికీ ఈషా రెబ్బా పెళ్లి మాట ఎత్తడం లేదు. అప్పట్లో ఓ తమిళ డైరెక్టర్‌తో ఈషా ప్రేమలో పడిందని, అతనిని పెళ్లాడబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆ డైరెక్టర్‌తో స్నేహం .. ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సదరు దర్శకుడికి అప్పటికే పెళ్లయి విడాకులు కూడా అయిపోయాయట. తర్వాత కొద్దిరోజులకే ఇది గాలివార్తగా నిలిచింది. ఇండస్ట్రీలో ఉన్న వారికి పెళ్లిళ్లు కావడం అంత తేలిక కాదని అప్పట్లో బాంబు పేల్చింది ఈషా. సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిలను అర్ధం చేసుకోవడం, వారితో కలిసి ట్రావెల్ చేయడం కష్టమని ఆమె పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో హల్‌చల్

సినిమాలు చేసినా, చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు ఈషా రెబ్బా. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు. తాజాగా బ్లూ కలర్ శారీలో రెచ్చిపోయారు ఈషా రెబ్బా. ట్రాన్సపరెంట్ చీరలో తన నాభీ, నడుము అందాలన్నీ కనిపించేలా గ్లామర్ షో చేశారు ఈ తెలుగు బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈషా అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: eesha rebba movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X