ఘాటు ఫొటోలతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తొలిసారి ఈ రేంజ్‌లో.. రెచ్చిపోయిన తెలుగమ్మాయి

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు అన్న నానుడి ఉంది. కానీ, ఆ మాటను అబద్ధమని నిరూపిస్తూ దాదాపు ఐదారేళ్లుగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ఈషా రెబ్బా. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో మాయ చేసే ఈ భామ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్‌ను కూడా అందుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఆ సంగతులు మీకోసం!

అలా ప్రయాణం మొదలు.. ఇలా ఎంటర్

అలా ప్రయాణం మొదలు.. ఇలా ఎంటర్

చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ప్రవేశించింది.

 వరుస సినిమాలతో దూకుడు.. ఆ రెండే

వరుస సినిమాలతో దూకుడు.. ఆ రెండే

ఆరంభంలోనే తనలోని టాలెంట్లను నిరూపించుకున్న ఈషా రెబ్బాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె సుదీర్ఘ కెరీర్‌లో 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ మొత్తంలో 'అంతకు ముందు ఆ తర్వాత', 'అమీతుమీ' మాత్రమే విజయం సాధించాయి.

అన్నీ ఉన్నా కష్టాలు.. చాలా కథలు నో

అన్నీ ఉన్నా కష్టాలు.. చాలా కథలు నో

అందానికి అందం.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చేయగల సత్తా ఉన్నప్పటికీ.. ఎందుకో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. చిన్న చిన్న చిత్రాల్లో నటించే ఛాన్స్‌లు వచ్చినప్పటికీ.. పెద్ద ప్రాజెక్టులను దక్కించుకోలేకపోతోంది. సెకెండ్ హీరోయిన్‌గానూ.. గ్లామర్ పాత్రల్లోనూ ఆమెకు ఛాన్స్‌లు వస్తున్నా.. వాటిని రిజెక్ట్ చేయడంతో పాటు పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోందామె.

ఛాన్స్‌ల కోసం అలా కూడా.. రెండింటిలో

ఛాన్స్‌ల కోసం అలా కూడా.. రెండింటిలో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ'లో ఈషా రెబ్బా నటించింది. అయితే, ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక, ఇప్పుడు అక్కినేని అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లోనూ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఆమె రోల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

డిజిటల్ వరల్డ్‌లో.. బ్యూటీపై ప్రశంసలు

డిజిటల్ వరల్డ్‌లో.. బ్యూటీపై ప్రశంసలు

కొద్ది రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్ 'పిట్ట కథలు' పేరుతో ఓ సిరీస్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన 'పింకీ'లో ఈషా రెబ్బా నటించింది. రెండు జంటలైన సత్యదేవ్‌ - ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్‌ - ఆషిమా నర్వాల్‌ మధ్య మారిన అనుబంధాన్ని తెలిపే కథతో రూపొందిన ఇది నిరాశ పరిచింది. కానీ, ఈ సిరీస్‌లో ఈషా యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి.

 అక్కడ ఎప్పుడూ బిజీగానే ఉంటోందిగా

అక్కడ ఎప్పుడూ బిజీగానే ఉంటోందిగా

వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ.. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కాక రేపుతోంది. ఈ కారణంగానే ఈషా రెబ్బా ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

Recommended Video

RGV's Reaction After Watched 'Akasha Veedhullo' Movie Trailer ​| Filmibeat Telug
ఘాటు ఫొటోలతో షాకిచ్చిన ఈషా రెబ్బా

ఘాటు ఫొటోలతో షాకిచ్చిన ఈషా రెబ్బా

సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు వదులుతూ సెగలు రేపుతోంది ఈషా రెబ్బా. ఇందులో భాగంగానే తాజాగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో అమ్మడు ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అందుకే ఈ పిక్‌లకు దాదాపు లక్షకు పైగానే లైకులు వచ్చాయి. దీంతో ఇవన్నీ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X